Vikram OTT Release Date: హై వోల్టేజ్ వీడియోతో క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్.. పదండి చూసుకుందాం!
విశ్వ నటుడు కమల్ హాసన్ మొత్తానికి విక్రమ్ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని తన స్టార్ హోదా ఏమిటో మరోసారి నిరూపించుకున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ ఆయనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. విక్రమ్ సినిమా విజయానందంలో కమల్ హాసన్ ఆ సినిమాకు పని చేసిన అందరికీ కూడా ఏదో ఒక కానుక ఇచ్చి తన ఆనందాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు ఖరీదైన కారును ఇచ్చారు. ఇక సినిమాలో ప్రత్యేకమైన రోలెక్స్ పాత్రలో నటించిన సూర్యకు రోలెక్స్ వాచ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఇటీవల సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కమల్ హాసన్ ప్రత్యేకంగా విందు భోజనం కూడా ఇచ్చారు. అదేవిధంగా వారితో కలిసి ప్రత్యేకంగా భోజనం కూడా చేశారు. కమల్ హాసన్ ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఓవర్గం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా జూలై 8వ తేదీన ఓటీటీ లో విడుదల కాబోతున్నట్లు ఇదివరకే కొన్ని వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అఫీషియల్ గా మరొక క్లారిటీ ఇచ్చింది. అలాగే కమల్ హాసన్ కూడా ఒక ప్రత్యేకమైన వీడియో ద్వారా ఆ విషయాన్ని తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మనకు నచ్చిన సినిమాలను ఎన్నిసార్లు చూసినా చాలా లేదు కదా అంటూ పవర్ఫుల్ గన్నుతో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ త్వరలోనే రాబోతోంది అని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా పదండి చూసుకుందాం అనే డైలాగ్ తో కూడా కమల్ హాసన్ మరొకసారి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ లో కూడా మంచి రిజల్ట్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో అత్యధిక లాభాలను అందించిన తమిళ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











