ఓటీటీలో దుమ్ము రేపుతున్న విక్రమ్.. డిస్నీ+హాట్ స్టార్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌తో రికార్డు
విలక్షణ నటుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్‌లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. గత నాలుగువారాలకుపైగా థియేటర్లలో కాసుల పంట పండించిన ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో ఫ్లాట్‌ఫాంపై రికార్డులు సృష్టిస్తున్నది. ఈ సినిమా అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో కమల్ హాసన్, డీస్నీ హాట్ స్టార్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. విక్రమ్ ఓటీటీ రికార్డుల వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు
విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వసూళ్లను నమోదు చేసింది. గత నాలుగు వారాల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అంటే నైజాంలో 7 కోట్లకుపైగా, ఆంధ్రాలో 10 కోట్లకుపైగా షేర్, 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 396 కోట్ల గ్రాస్, 200 కోట్ల షేర్ సాధించింది. కమల్ హాసన్ కెరీర్‌లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు కెక్కింది.

ఐదు భాషల్లో ఓటీటీ రిలీజ్
విక్రమ్ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే.. జూలై 8న డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించి చిత్రంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై ఓటీటీలో కూడా హిట్ అందుకుంటున్నది. ఐదు భాషల్లోనూ విక్రమ్ రికార్డ్ వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకొన్నది అని నిర్వాహకులు తెలిపారు.

కమల్ హాసన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ
ఓటీటీలో కూడా విక్రమ్ సినిమా అద్బుతమైన రెస్సాన్స్ సొంతం చేసుకోడంపై కమల్ హాసన్ స్పందించారు. విక్రమ్ చిత్రాన్ని ప్రేక్షకులు అందించిన అపూర్వ విజయం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం డిస్నీ+ హాట్ స్టార్ ద్వారా ప్రతి ఇంటికీ విక్రమ్ చేరుకున్నది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించడం ఆనందంగా ఉంది. మా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్ అని కమల్ హాసన్ అన్నారు.

క్లాసిక్ మూవీగా విక్రమ్
మా ఓటీటీలో విక్రమ్ సాధిస్తున్న రికార్డ్ వ్యూవర్ షిప్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు అద్బుతంగా ఉంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ఘన విజయాన్ని అందుకొని క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ వ్యూయర్ షిప్‌లో రికార్డులు క్రియేట్ చేయడం ఆనందంగా ఉంది అని డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ అన్నారు.

బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్
విక్రమ్ సినిమా దేశవ్యాప్తంగా డిస్నీ+హాట్ స్టార్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్‌ను నమోదు చేసింది. ఇంత గొప్ప సినిమాను ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా చేరువ చేయడం ఆనందంగా ఉంది. కమల్ హాసన్ స్టార్ డమ్‌ను విక్రమ్ మరోసారి ప్రూవ్ చేసింది అని డిస్నీ+హాట్ స్టార్ నిర్వాహకులు తెలిపారు.


Click it and Unblock the Notifications











