Bharateeyudu 2 OTT: భారతీయుడు 2 ఓటీటీ డేట్ వచ్చేసింది.. సర్‌ప్రైజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్
సౌతిండియాలో టాలెంటెడ్ సీనియర్ స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒకరు. తనదైన విలక్షణమైన నటనతో సుదీర్ఘ కాలంగా మాయ చేస్తోన్న ఆయన.. ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భారతీయుడు 2' (Indian 2). లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పుడెప్పుడో వచ్చిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రూపొందింది. దీంతో ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని జూలై 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కమల్ హాసన్ హీరోగా నటించిన 'భారతీయుడు 2' మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. కానీ, ఈ సినిమాకు అనుకున్న విధంగా టాక్ లభించలేదు. దీనికి ఫస్ట్ వీక్ మంచి వసూళ్లు వచ్చినా.. రెండో వారంలో మాత్రం భారీగా తగ్గిపోయాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా ఆశించిన రీతిలో ప్రదర్శన చేయలేదు. దీంతో కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సదరు సంస్థ నెల రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. తమిళ చిత్ర పరిశ్రమ పెట్టిన నిబంధనలతో ఇది మరింత ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతోంది.
సందేశాత్మక కథతో రూపొందిన 'భారతీయుడు 2' సినిమా స్ట్రీమింగ్‌పై చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని నెల కాకుండానే అంటే ఆగస్టు 9వ తేదీనే సదరు సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ సినిమాను తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతుంది.
ఇదిలా ఉండగా.. 'భారతీయుడు 2' సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఇందులో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











