Indian 2 OTT: కమల్ 'భారతీయుడు 2' ఓటీటీ డీల్.. రికార్డ్స్ బ్రేక్.. అన్ని కోట్లు ఏంటీ సామీ?

యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 50 ఏళ్లకుపైగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన వర్సటైల్ హీరో కమల్ హాసన్. ఇప్పటివరకు కమల్ హాసన్ సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. ఇక ఇటీవల నటించిన విక్రమ్ మాసివ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా ఆయనకు నాలుగేళ్ల తర్వాత సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో విలన్ గా మెప్పించేందుకు రెడీ ఆయన ప్రతిష్టాత్మక సినిమా ఇండియన్ 2 ఓటీటీ రైట్స్ హాట్ టాపిక్ అవుతోంది.

ఉలగ నాయగన్ కమల్ హాసన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. విభిన్నమైన సినిమాలతోపాటు డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆద్యంతం సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథానాయకుడు. ఇప్పటివరకు సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆయన విక్రమ్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెట్టారు. కల్కి 2898 ఏడీలో నటిస్తున్న కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో ఓ సినిమా చేయనున్నాడని ఇటీవల టాక్ వచ్చింది. దీన్ని 2024లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

Kamal Haasan Starrer Indian 2 Movie Digital Rights To Netflix For Rs 200 Cr

ఇక కమల్ హాసన్ సినీ కెరీర్ లో భారతీయుడు సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1996 సంవత్సరంలో సెన్సేషన్ గా మారింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రావాలని ఎంతో మంది ఆశపడ్డారు. అందుకు అనుగుణంగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శంకర్. పలు వాయిదాలు, ఆటంకాలతో భారతీయుడు 2 చిత్రీకరణ సాగుతోంది. శంకర్ మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణ చేయడంతో ఇండియన్ 2 కాస్తా ఆలస్యం అవుతూ వస్తోంది.

ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఇండియన్ 2 సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని వినికిడి. అంతేకాకుండా భారీ వ్యయం వెచ్చించి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారతీయుడు 2 సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందని టాక్.

దాదాపు రూ. 200 కోట్లకు ఇండియన్ 2 ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే రికార్డులు బ్రేక్ అయినట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో కూడా కమల్ హాసన్ రెండు పాత్రలు చేయనున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X