Thug Life OTT Release : రిలీజ్ కు ముందే థగ్ లైఫ్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం 'థగ్ లైఫ్'. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబోలో 3 దశాబ్దాల తర్వాత ఈ చిత్రం రావడంతో ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ క్రమంలోనే థగ్ లైఫ్ చిత్రానికి సంబంధించిన ఓటీటీ వివరాలు కూడా ఆసక్తికరంగా మారాయి. రిలీజ్ కు ముందే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ డీల్ కు రైట్స్ ను కొనుగోలు చేసింది. రిలీజ్ డేట్ ను కూడా ముందుగానే ప్రకటించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ వివరాలు..
1987లో కమల్ హాసన్ - మణిరత్నం తర్వాత వచ్చిన నాయకన్ చిత్రం తర్వాత మళ్లీ 37 ఏళ్లకు వీరి కాంబోలో థగ్ లైఫ్ చిత్రం రూపుదిద్దుకుంది. కమల్ హాసన్ కు ఇది 234వ చిత్రం. తమిళ భాషలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మణిరత్నం తెరకెక్కించారు. రాజ్ కమల్ ఇంట్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, అభిరామి కథానాయికలుగా నటించారు. తమిళ స్టార్ శింబు కీలక పాత్రను పోషించడం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీమియర్ టాక్ మాత్రం పాజిటివ్ గా కనిపిస్తుంది. మున్ముందు ఎలా ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Kamal Haasan Thug Life Movie Ott Release Date and Price

రూ.210 కోట్లకు థగ్ లైఫ్ ఓటీటీ డేట్..
కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం, పైగా సినిమాను గట్టిగా ప్రమోట్ చేయడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయింది. మరోవైపు కమల్ హాసన్ వరుసగా బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని షేక్ చేస్తుండటం, పైగా మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో రిలీజ్ కు ముందే ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ.149.7 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్ ను స్టార్ విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఓటీటీ, శాటిలైట్ ద్వారా ఈ చిత్రానికి విడుదలకు ముందే రూ.210 కోట్లు వసూళ్లు కావడం విశేషం.

థగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సాధారణంగా ఏ చిత్రమైనా థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక స్టార్ హీరోల చిత్రాలు, వాటి ఫలితాలను బట్టి ఇంకా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రాన్ని మాత్రం థియేట్రికల్ రిలీజ్ అయిన 8వ వారం తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. 2025, ఆగస్టు 7న ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది.

తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్..
కమల్ హాసన్ కు తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ ఉండటం.. తెలుగు స్టేట్స్ లోనూ మంచి డిమాండ్ ఉండటం తెలిసిందే. ఇక థగ్ లైఫ్ చిత్రం తెలుగు మార్కెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.21 కోట్లుగా ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.

More from Filmibeat

Read more about: kamal haasan thug life ott movies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X