twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikram Movie OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. మరిన్ని ఎక్కువ సీన్లతో సరికొత్తగా..?

    |

    విశ్వ నటుడు కమలాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్టర్ సినిమా అనంతరం క్రియేటివ్ దర్శకుడు లోకేష్ కనగరాజు తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా సాలీడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ముఖ్యంగా తెలుగులో కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఐతే అందుకున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లో కూడా విడుదల కాబోతోంది. అందుకు సంబంధించిన ఒక టాక్ వైరల్ గా మారుతొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    కమల్ హాసన్ కౌంటర్ హిట్

    కమల్ హాసన్ కౌంటర్ హిట్

    కమల్ హాసన్ గత కొంత కాలంగా ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలను కమలాసన్ సొంత ప్రొడక్షన్ లోనే తెరకెక్కించాడు. దీంతో ఆయనను ఆర్థికంగా కూడా దెబ్బతీన్నారు. కమల్ హాసన్ పని అయిపోయింది అని మార్కెట్ పూర్తిస్థాయిలో తగ్గిపోయింది అని కూడా అన్నారు. కానీ విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఆ కామెంట్స్ కు ఊహించని విధంగా కౌంటర్ అయితే ఇచ్చాడు.

     బాహుబలి రికార్డ్ బ్రేక్

    బాహుబలి రికార్డ్ బ్రేక్

    ప్రస్తుతం తమిళనాడులో అయితే ఏ సెంటర్స్ లో చూసినా విక్రమ్ సినిమా హడావిడి కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ఒక తమిళ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమా 350 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకుని బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. విజయ్ సినిమాల తర్వాత భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసిన సినిమాగా విక్రమ్ నిలిచింది.

    పాజిటివ్ హైప్

    పాజిటివ్ హైప్

    ఈ సినిమాలో కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫాహద్ ఫాజిల్ సూర్య ముఖ్యమైన పాత్రలో నటించడం ద్వారా సినిమాకు మొదటి నుంచి కూడా మంచి పాజిటివ్ హైప్ ఐతే క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడటంతో రిలీజ్ హక్కుల కోసం కొంతమంది పోటీపడ్డారు. ఇక చివరికి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమా హక్కులను 7కోట్లకు కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించిందిం ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ డబుల్ ప్రాఫిట్స్ తో కొనసాగుతున్నాడు.

     ఓటీటీ డేట్ ఫిక్స్?

    ఓటీటీ డేట్ ఫిక్స్?

    అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా ఒక వార్త వైరల్ గా మారింది సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 8 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    ఎవరు చూడని సీన్స్

    ఎవరు చూడని సీన్స్

    అయితే వెండితెరపై చూడని కొన్ని సన్నివేశాలను కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసే విక్రమ్ సినిమాలో జత చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సూర్యకు సంబంధించిన సన్నివేశాలతో పాటు విజయ్ సేతుపతి సంబంధించిన మరి కొన్ని యాక్షన్ సీన్స్ సినిమాలను యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఓటీటీ లో విక్రమ్ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

    English summary
    Kamal haasan Vikram movie OTT release date details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X