OTT: "భారతీయుడు 2" ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో అంటే?

ఈ ఏడాదిలో సౌత్ ఇండియా సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్ సినిమాలు మాత్రం కాస్త తక్కువే వచ్చాయని చెప్పాలి. పైగా ఈ నెలలో చాలా రోజులు డ్రై వాతావరణమే నడవడంతో రీ రిలీజ్ లు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ సమయంలో వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమానే ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి". ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మళ్ళీ ఆడియెన్స్ థియేటర్స్ లోకి వెళ్లడం స్టార్ట్ చేశారు.

కాగా ఈ సినిమా తర్వాత వచ్చిన మరో క్రేజీ పాన్ ఇండియా సినిమానే "ఇండియన్ 2". కల్కి విలన్ ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన ఈ సినిమాని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎదురు చూసిన చూపులకి శంకర్, కమల్ లు మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు అనే టాక్ నే ఎక్కువ వచ్చింది.

Kamal haasan s Indian 2 to release in this ott here is release details

అయినా కూడా తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్ళని అందుకున్న ఈ సినిమా ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది. అయితే టాక్ మరీ అంత సూపర్ పాజిటివ్ గా రాకపోవడంతో ఓటిటి రిలీజ్ ని దగ్గర చేస్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా లేటెస్ట్ రూమర్స్ ప్రకారం భారతీయుడు 2 ఓటిటి ఎంట్రీ ఈ వచ్చే నెల ఆగష్టు లోనే ఉంటుంది అని జూలై 12 న రిలీజ్ అయ్యిన ఈ సినిమా నెల లోపే లేదా నెలన్నర తర్వాత వస్తుందని వినిపిస్తుంది.

కాగా ఈ సినిమా ఓటిటి హక్కులని ప్రఖ్యాత ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలులో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో వచ్చే ఆగస్ట్ లోనే భారతీయుడు వస్తాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా దీనికి ముందు భారతీయుడు 1 కూడా నెట్ ఫ్లిక్స్ లో రీమాస్టర్ వెర్షన్ లో జూలై 15 నుంచి అందుబాటులో ఉండనుంది. కాగా దీని తర్వాత మరో నెలలోనే పార్ట్ 2 కూడా వచ్చేస్తుందని టాక్.

Kamal haasan s Indian 2 to release in this ott here is release details

మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇంకా ఈ భారీ సినిమాలో యువ సిద్ధార్థ్ కూడా ముఖ్య పాత్రలో నటించగా రకుల్ ప్రీత్ సింగ్ తన సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే వీరితో పాటుగా ఎస్ జె సూర్య, బ్రహ్మానందం తదితరులు నటించారు. అలాగే ప్రస్తుతం సినిమా థియేటర్స్ లో 20 నిముషాలు రన్ టైం ని కూడా తగ్గించినట్టుగా తెలుస్తుంది.

మరి ఓటిటిలో కూడా ఇదే వెర్షన్ ని రిలీజ్ చేస్తారో లేక 3 గంటల సినిమానే విడుదల చేస్తారో అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే.. మరి దీనితో పాటుగా శంకర్ ఇండియన్ 3 కూడా ఉందని సినిమా క్లైమాక్స్ లో రివీల్ చేశారు. దాని పరిస్థితి ఏంటి అనేది కూడా అందరిలో ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Read more about: indian 2 shankar kamal haasan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X