Indian on OTT: జూలై 15న ఓటీటీలోకి ఇండియన్ మూవీ.. ఏ ఓటిటీలో స్ట్రీమింగ్ అంటే?
భారతీయ సినిమా పరిశ్రమలో ఇండియన్ (తెలుగులో భారతీయుడు) చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 28 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ఇటీవల భారతీయుడు 2 మూవీ జూలై 12వ తేదీన రిలీజైంది. అయితే ఈ సినిమా ఓ వైపు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. ఈ నేపథ్యంలో సెన్సేషన్ హిట్ అయిన ఇండియన్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ సిద్దమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. కమల్ హాసన్, మనీషా కోయిరాల, ఊర్మిల మతోంద్కర్, సుకన్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అప్పట్లో 15 కోట్ల రూపాయలతో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

ఇండియన్ మూవీ మే 9వ తేదీన 1996 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో హిందుస్థాని, తెలుగులో భారతీయుడు సినిమాగా రిలీజైంది. అయితే అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా 100 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అయితే ఇండియన్ స్క్రీన్‌పై కల్ట్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. ఫ్యాన్సీ రేటును చెల్లించి ఈ సినిమాను జూలై 15వ తేదీన స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమాకు భారీగా అభిమానులు ఉండటంతో మరోసారి ఓటీటీలో భారీ స్పందనను కూడగట్టుకొనే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అయితే ఈ తరం ప్రేక్షకులకు ఇండియన్ సినిమాను చూపించాలనే లక్ష్యంతో ఓటీటీ రిలీజ్ చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇక ఇండియన్ 2 సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 6 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రెండో పార్ట్ ఏ విధమైన కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











