Chandramukhi2 OTT: ఆ ఓటీటీలో చంద్రముఖి2... ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కింది. ఇక ఈ చిత్రానికి కూడా చంద్రముఖిని తెరకెక్కించిన పీ వాసునే దర్శకత్వం వహించారు. ఇక చంద్రముఖి మూవీ సెప్టంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొరియోగ్రాఫర్ కం హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం చంద్రముఖి 2. రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించారు దర్శకుడు పీ వాసు. చంద్రముఖి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఇక సెన్సెషన్ క్రియేట్ చేసిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ రూపొందించారు.

సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. దర్శకుడు పీ వాసు టేకింగ్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమాను కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‍లో సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
చంద్రముఖి తర్వాత సీక్వెల్‍గా వస్తున్న చంద్రముఖి 2 సినిమాపై ఆది నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నగురువారం వరల్డ్ వైడ్‌గా విడుదల చేశారు. అయితే చంద్రముఖి 2 సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సేమ్ చంద్రముఖి తరహాలోనే మూవీని దింపేసారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాఘవా లారెన్స్... రజినీని బీట్ చేయలేకపోయారు. ఇక సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇక చంద్రముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్, రైట్స్ విషయంలో ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. చంద్రముఖి 2 సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో చంద్రముఖి 2ను స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. అయితే చంద్రముఖి 2 చిత్రాన్ని 60 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక చంద్రముఖి 2 టెలివిజన్ హక్కులను ప్రఖ్యాత జెమినీ టీవీ సొంతం చేసుకుంది. కాగా చంద్రముఖి 2లో రాధికా శరత్ కుమార్, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏ సినిమా అయినా విడుదల అయిన నెలకే ఓటీటీలోకి వస్తుంది. మరి చంద్రముఖి 2 రెస్పాన్స్ బట్టి మరి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే


Click it and Unblock the Notifications











