Netflix, కరణ్ జోహర్‌పై మండిపడ్డ కంగన రనౌత్.. చెత్త డైరెక్టర్‌తో మీటింగ్ ఏమిటి? అంటూ..
ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్, దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌పై బాలీవుడ్ నటి, ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ మండిపడ్డారు. నెట్‌ఫ్లిక్స్ కంటే అమెజాన్ ప్రైమ్ ఇండియాకు భారత్‌లో మంచి ఆదరణ ఉందని ఆమె తెలిపారు. అమెజాన్ ప్రూమ్ వీడియో కంటెంట్ విషయంలో ఓపెన్ మైండ్‌తో ఉంది. అలాగే ప్రజాస్వామ్య విలువలకు మద్దతు ఇచ్చే విధంగా వారి విధానాలు ఉన్నాయని కంగన అభిప్రాయపడింది. నెట్‌ఫ్లిక్స్ గ్గోబల్ చీఫ్ బెలా బజారియాతో పార్టీ చేసుకోవడంపై కంగన తప్పుపట్టింది.
అయితే నెట్‌ఫ్లిక్స్ కంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మంచి ఫలితాలను సాధిస్తున్నదనే విషయం డేటా తెలియజేస్తున్నది. ఇలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ ఇండియాలో పర్యటిస్తే.. 90 దశకంలో అడపదడపా హిట్లు ఇచ్చిన డైరెక్టర్‌ను కలువడం ఏమిటి? అలాంటి డైరెక్టర్‌తో కలిస్తే ప్రయోజనం ఏమిటి అని కంగన ప్రశ్నించింది.

ఇండియన్ మార్కెట్ గురించి నెట్‌ఫ్లిక్స్ హెడ్‌కు అవగాహన లేదు. ఇండియన్ మార్కెట్ అంటే.. పిచ్చి గాసిప్స్, రూమర్లను ప్రచారం చేసే డైరెక్టర్ కాదు. ఇక్కడ వేలాది మంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు అని కంగన తెలిపింది.
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ నిర్వహించిన పార్టీలో షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, ఫర్హాన్ అఖ్తర్, షిబానీ దండేకర్, రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్, సారా ఆలీ ఖాన్, కృతిసనన్, మనీష్ మల్హోత్రా, శశాంక్ ఖైతాన్, సిద్దార్థ్ రాయ్ కపూర్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో ముంబైలో ఓ పార్టీని నిర్వహించింది. ఈ పార్టీకి హాజరైన కంగన రనౌత్ తాను నటిస్తున్న చిత్రం టికు వెడ్స్ షేరు మూవీ రిలీజ్ డేట్‌ను ఈ వేడుకలో ప్రకటించారు.


Click it and Unblock the Notifications











