ఓటీటీలోకి రాబోతున్న కంగనా కొత్త సినిమా.. ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 36 ఏళ్ల వయసు కల్గిన ఆమె అనేక అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకు వాళ్లలో ఒకరిగా ఉన్న ఈమె ఏది ఉన్నా మొహం మీదే చెప్పేస్తుంది. ఇప్పటి వరకు మూడు జాతీయ అవార్డులు అందుకున్న ఈ ముద్దుగుమ్మ నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకుంది. 2006లో గాంగ్ స్టర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన ఈమె అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
ఆ తర్వాత కూడా ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె ఫుల్ క్రేజ్ సంపాధించుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాధించుకున్న కంగనాకు అందంతో పాటు అభినయం కూడా ఎక్కువే. అందుకే ఇలా ఎన్నెన్నో అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది తేజస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రానికి సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించారు.

ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాలో కంగనా రనౌత్ తో పాటు ఆశిష్ విద్యార్థి, అన్షుల్ చౌహన్, వరుణ్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. చంద్రముఖి 2 తర్వాత నటించి ఈ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఎవరికీ తెలియకముందే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. భారత వైమానికి దళంలోలకి మొట్ట మొదటి సారి మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీన చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఎప్పుడు, ఎక్కడ విడుదల కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 వేధికగా కంగనా రనౌత్ తేజస్ సినిమా విడుదల కాబోతుంది. కానీ ఈ ఏడాది మాత్రం కాదు. వచ్చే ఏడాది అంటే 2014 జనవరి 5వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూడని వాళ్లు ఓసారి కంగనా రనౌత్ తేజస్ సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసేయండి.


Click it and Unblock the Notifications











