Kanguva OTT : ఓటీటీలోకి కంగువ .. కళ్లు చెదిరే మొత్తానికి డీల్ , స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే?

సిరుత్తై శివ దర్శకత్వంలో తమిళ విలక్షణ నటుడు సూర్య నటించిన కంగువా బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్ , ట్రైలర్‌, పోస్టర్‌లలో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తోందనని ఉత్కంఠ నెలకొంది. అయితే ఓటీటీ లవర్స్ మాత్రం కంగువా ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు కంగువా నిర్మించారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి కంగువా దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సూర్య సరసన దిశా పటానీ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ ఇందులో విలన్ పాత్ర పోషించారు. యానిమల్‌తో దేశం మొత్తాన్ని భయపెట్టిన బాబీ.. ఇందులో ఎలా నటించారోనని ప్రేక్షకులు ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు.

kanguva ott release when and where to watch suriya bobby deol starrer movie post theatrical run

16వ శతాబ్ధానికి చెందిన కంగువా అనే పోరాట యోధుడిగా, ఫ్రాన్సిస్ అనే నేటి కాలానికి చెందిన కుర్రాడిగా సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నట్లుగా కోలీవుడ్ టాక్. అంతేకాదు.. మొత్తం ఐదు గెటప్స్‌లో సూర్య కనిపించారని థియేటర్‌లో ఆయన లుక్, మేనరిజానికి ప్రేక్షకులు ఫిదా అవుతారని చెబుతున్నారు.

ఇకపోతే.. కంగువా ప్రీ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా సూర్య సినిమా రూ. 178 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడులో రూ. 70 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 24 కోట్లు, కర్ణాటకలో రూ. 10.50 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 40 కోట్ల మేర కంగువా వ్యాపారం చేసింది. అంటే ఈ సినిమా హిట్ కావాలంటే రూ. 180 కోట్ల షేర్, రూ. 360 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది.

ఓవర్సీస్ ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు కంగువా రూ. 15 కోట్ల మార్క్ అందుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సాయంత్రానికి బుకింగ్స్ జోరందుకుంటాయని.. మొత్తం మీద కంగువా ఫస్ట్ డే రూ. 60 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉండగా.. కంగువా ఓటీటీ గురించి ఇప్పుడు డిస్కషన్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌ను బట్టి కంగువా డిజిటల్ రైట్స్ కళ్లు చెదిరే ధర పలికాయట. సూర్య నటనకు తోడు బాబీ డియోల్, దిశా పటానీ వంటి స్టార్స్ ఉండటంతో కంగువాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దాదాపు ఏకంగా రూ. 100 కోట్లకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్‌ బిజినెస్ క్లోజ్ చేసిన తర్వాత కంగువా ఓటీటీలలోకి రానుంది. పొంగల్ కానుకగా కంగువా ఓటీటీలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: kanguva suriya bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X