OTT ఓటీటీలోకి రక్షిత్ శెట్టి గ్రాండ్ ఎంట్రీ.. వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కన్నడ నటుల్లో రక్షిత్ శెట్టి ఒకడు. మొదటి నుంచి ఈ హీరో తెలుగులో ఫేమస్ అవ్వడానికి కారణం నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో ఆమె అడుగుపెట్టిందే రక్షిత్ సినిమాతో. ఆ తరువాత అతనినే ప్రేమించి నిశ్చితార్థం కూడా జరుపుకుంది.
ఇక ఎంగేజ్ మెంట్ అయ్యాక తెలుగులో ఛలో సినిమాతో హిట్ అందుకుంది. వెంటనే గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకోవడం.. విజయ్ తో లిప్ లాక్ లు పెట్టడంతో ఆమెకు - విజయ్ కు మధ్య రిలేషన్ మొదలయిందని వార్తలు వచ్చాయి. ఇదే కారణమో.. మరి వేరే కారణమో తెలియదు కానీ రక్షిత్ - రష్మిక ఎంగేజ్ మెంట్ ను బ్రేక్ చేసుకొని ఎవరి జీవితాలను వాళ్లు చూసుకున్నారు.

ప్రస్తుతం ఇద్దరు తమ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగులో రక్షిత్..777 చార్లీ, సప్తసాగరాలు దాటి సినిమాల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రక్షిత్ కేవలం హీరో మాత్రమే కాదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. తాజాగా రక్షిత్.. డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. హీరోగా కాకుండా నిర్మాతగా మొదటి అడుగు వేయనున్నాడు. ఏడు స్టోరీలతో యాంథాలజీ సిరీస్‍గా ఒక వెబ్ సిరీస్ ను నిర్మించాడు. అదే ఏకం.
ఈ సిరీస్‍కు సందీప్ పీఎస్, సుమంత్ భట్ క్రియేటర్లుగా ఉండగా పరంవాహ్ స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి నిర్మించాడు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు 2021 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే, ఈ సిరీస్‍ను ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకోలేదని రక్షిత్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్ అందరూ చూడాలనే ఉద్దేశంతో తానే సొంతంగా ఓ ప్లాట్‍ఫామ్ తీసుకొచ్చినట్లు తెలిపాడు. ఈ సిరీస్ అందరినీ నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు రక్షిత్ శెట్టి.

www.ekamtheseries.com అనే వెబ్ సైట్ లో జూలై 13 నుంచి.. స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సైట్ లో కూడా ఇది ఫ్రీ స్ట్రీమింగ్ కాదు. ఏకం వెబ్ సిరీస్‍ను వెబ్‍సైట్‍లో చూడాలంటే రూ.149 ఫీజు చెల్లించాలి. ఈ విషయమై రక్షిత్ మాట్లాడుతూ.. రూ.149 చెల్లిస్తే ఈ సిరీస్‍తో పాటు కొంత ప్రత్యేకమైన కంటెంట్ కూడా ఉండనుందని, ఇప్పటికే ఆ వెబ్‍సైట్‍లో విష్ లిస్ట్‌ను అందుబాటులో ఉంచినట్టు తెలిపాడు.
ఇక ఈ సిరీస్ విషయానికొస్తే.. ఇందులో ప్రకాశ్ రాజ్, రాజ్ బీ శెట్టి, షైన్ శెట్టి లాంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. తప్పకుండా ఈ సిరీస్ అభిమానులను మెప్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి ఫీజు కట్టి.. ఏకం సినిమాను అభిమానులు చూస్తారో.. లేదో చూడాలంటే జూలై 13 వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











