OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా... అస్సలు మిస్ అవ్వొద్దు!

స్టార్ హీరోలు ప్రభాస్, షారుక్ ఖాన్ లను భయపెట్టిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రభాస్ నటించిన సలార్, షారుక్ ఖాన్ నటించిన డంకీ చిత్రాలకు పోటీగా వచ్చిన చిత్రం కాటేరా. ఈ సినిమా కన్నడంలోనే రిలీజ్ అయినప్పటికీ.. ఆ సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వసూలు చేసింది. డీ బాస్ దర్శన్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ఈ సినిమా కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ నచ్చితే ఏ భాష చిత్రం అనేది ఆలోచించరు. ఆ సినిమాను ఆదరిస్తుంటారు. ప్రస్తుతం ఓటీటీల్లో సూపర్ హిట్ చిత్రాలు అలరిస్తున్నాయి. తాజాగా మరో చిత్రం కూడా ఓటీటీలో దుమ్మురేపుతోంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటేస్ట్ సినిమా 'కాటేరా'. గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది.

Kannada Actor Darshan Kaatera Movie Now Streaming on Zee5 Full Details Here

కాటేరా చిత్రాన్ని ముందుగా దీనిని పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.... అటు సలార్ బరిలో ఉండడంతో కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు హిందీలో అప్పుడు డంకీ చిత్రం రిలీజ్ అయింది. కన్నడంలో రిలీజ్ అయిన కాటేరా.. అటు సలార్, డంకీ చిత్రాలను వణికించింది. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టింది.

కాటేరా సినిమా కలెక్షన్ల వల్ల సలార్ చిత్రానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రిమియర్ రిలీజ్ అయింది. డీ బాస్ హీరో దర్శన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను 7 రోజుల ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఫిబ్ర‌వ‌రి 9 నుంచి జీ5 ఓటీటీలో కాటేరా సినిమా తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఈ సినిమాకు థియేటర్ల వద్దే కాదు.. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. 1970 బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా రూపొందించారు. ఇక ఈ చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ.105 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Kannada Actor Darshan Kaatera Movie Now Streaming on Zee5 Full Details Here

కాటేరా చిత్రంలో ద‌ర్శ‌న్ యాక్టింగ్‌, అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్ గా ఈ సినమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇందులో జగపతి బాబు విలన్ గా నటించారు.రాక్‌లైన్ వెంక‌టేష్ ఈ మూవీని నిర్మించాడు. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో కాటేరా నిలిచింది. ఈ వీకెండ్ కు మంచి సినిమా చూడాలనకుంటే.. ఈ చిత్రాన్ని ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X