OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ రూరల్ యాక్షన్ మూవీ... ఎందులో చూడాలంటే?

ఇప్పుడంతా సలార్ మేనియా నడుస్తుంది. అటు ఓటీటీల్లో కూడా అంత గొప్ప సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే రిలీజ్ అయిన వాటిల్లో ఓ కన్నడ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది. కన్నడ హీరో రాజ్ బీ శెట్టి నటించిన టోబీ చిత్రం ఓటీటీలో సందడి చేస్తుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అసలు ఈ టోబీ ఏంటి.. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఓటీటీలోకి మరో కన్నడ బ్లాక్ బస్టర్ వచ్చేసింది. కన్నడ నటుడు రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా టోబీ ఓటీటీలోకి వచ్చేసింది. టోబీ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న కన్నడంలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఈ రూరల్ యాక్షన్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో నిర్మాతలకు కాసుల వర్షం కూడా బాగానే కురిసింది.

Kannada Hero Raj B Shetty Rural Action Toby Movie Now Streaming on Sony Live OTT Full Details Here

ఇక టోబీ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఎట్టకేలాకు టోబీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు మేకర్స్. టోబీ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలీవ్ కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

కన్నడతో పాటు, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు ఓటీటీలోను మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. టోబీ చిత్రంలో రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించగా.. ఇక ఈ చిత్రానికి బాసిల్ అచలక్కల్ దర్శకత్వం వహించారు.ఈ మూవీలో రాజ్ బీ శెట్టి యాక్టింగ్ హైలైట్‍ గా నిలవగా... చరిత్ర జే ఆచార్, సంయుక్త హొరనడు, గోపాల్‍కృష్ణ దేశ్‍పాండే, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రల్లో నటించారు.

Kannada Hero Raj B Shetty Rural Action Toby Movie Now Streaming on Sony Live OTT Full Details Here

ఈ సినిమా కథను కూడా హీరో రాజ్ బీ శెట్టినే అందించారు. ఇక చిత్రానికి ముధున్ ముకుందన్ మ్యూజిక్ సమకూర్చారు. లైటర్ బుద్ధా ఫిల్మ్స్, అగస్త్య ఫిల్మ్స్, కాఫీ గ్యాంగ్ స్టూడియో, స్మూత్ సైలర్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందించాయి. ఇక ఈ సినిమాలో మొదట ఆకర్షించేది కథ. ఈ సినిమాకు కథనే హీరోగా నిలిచింది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... అమాయకంగా ఉండే టోబీని హత్యలు చేసేందుకు ఊరి పెద్ద వాడుకుంటూ ఉంటాడు. తనను ఉపయోగించుకుంటూ మోసం చేసుకుంటున్నారని గ్రహించిన టోబీ.. ఎలా పగ తీర్చుకున్నాడనేది కథ. ఇక ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్టుగా నిలిచింది. అంతే కాదు రాజ్ బీ శెట్టి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ రూరల్ యాక్షన్ మూవీ టోబీని మీరు థియేటర్లలో మిస్ అయితే.. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో ఇంట్లోనే కూర్చొని చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X