Kantara OTT: కాంతర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతోందంటే?
కన్నడ టాలెంటెడ్ దర్శకుడు రిషబ్ శెట్టి తెరపైకి తీసుకు వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కేవలం దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా అతను నటించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అయితే అందించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 360 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. కేవలం 16 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తెలుగులో 50 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారా అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అసలైతే గత నెలలోనే ఓటిటిలో విడుదలవుతుంది అని అనుకున్నారు. కానీ కలెక్షన్స్ నెల రోజుల తర్వాత కూడా గట్టిగానే వస్తున్నాయని నిర్మాతలు ఎక్కువ టెంప్ట్ అవ్వలేదు. ఇక అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నవంబర్ 14వ తేదీన నుంచి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్లో చూడలేని వారు ఇప్పుడు ఓటీటీలో చూడాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా అన్ని విధాలుగా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు అయితే అందించింది. ఇక దర్శకుడు రిషబ్ శెట్టి త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీసుకురావచ్చు అని కన్నడ ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











