OTTలోకి రాబోతున్న శివరాజ్ కుమార్ కిక్కిచ్చే యాక్షన్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు అయిన ఈయన తాజాగా ఘోస్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కానీ తెలుగులో నవంబర్ 4వ తేదీన విడుదలై నిరాశే మిగిల్చింది. తెలుగులో ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా చిత్ర బృందం ఏమాత్రం నిరాశ పడలేదు.
ఎం.జీ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో శివరాజ్ కుమార్ తో పాటు అనుపమ్ ఖేర్, అర్చన జోయిస్, జయరాం, అభిజిత్, విజయలక్ష్మి, సత్య ప్రకాష్, ప్రశాంత్ నారాయణన్ లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. సందేశ్ ప్రొడక్షన్స్ లో సందేశ్ నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా టీం మరో అప్ డేట్ ను బయటకు వదిలింది. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఏ ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదల అవుతుంది, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విడుదలై రెండు వారాలు కూడా కాకముందే..!:
శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమా జీ5 ప్రీమియం వేదికగా స్ట్రీగింగ్ కాబోతుంది. అయితే ఈ విషయాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5యే ప్రకటించింది. నవంబర్ 17వ తేదీన ఘోస్ట్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. అయితే తెలుగులో విడుదల అయి రెండు వారాలు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండడం గమనార్హం. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని తెలుసుకున్న ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎగ్జైట్ అవుతున్నారు. థియేటర్లలో ఎలాగూ చూడలేదు కాబట్టి ఓటీటీలోనైనా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.
సినిమా కథ ఏంటంటే..?:
జైళ్లను ప్రైవేటీకరణ కోసం పోరాటం చేస్తున్న మాజీ సీబీఐ ఆఫీసర్ వామన్ శ్రీనివాస్ కల ఫలించగా.. జైలు నిర్మాణ భూమి పూజ కోసం వామన్ బృందం వెళ్తుంది. కానీ అక్కడ కిడ్నాప్ కు గురి అవుతుంది. వీరిని రక్షించేందుకు చరణ్ రాజ్ అనే అధికారిని సర్కారు రంగంలోకి దించుతుంది. సర్చింగ్ ప్రారంభించిన జయరాంకు వామన్ ను కిడ్పాన్ చేసింది బిగ్ డాడీ గ్రూప్ అని తెలియడంతో షాకవుతాడు. అయితే ఆ బిగ్ డాడీ ఎవరు, అతడి బ్యాగ్రౌండ్ ఏంటి, వామన్ ను వాళ్లెందుకు అరెస్ట్ చేశారనేది కథ.

అలాగే జైలులో బంగారు నిల్వల కథ ఏమిటి, కిడ్నాప్ కేసును చరణ్ రాజ్ ఎలా హ్యాండిల్ చేశారనేది సినిమాలో చక్కగా చూపంచారు. అంతేకాకుండా అసలు కిడ్నాప్ డ్రామాలో నిజమైన ఘోస్ట్ ఎవరు, బిగ్ డాడీ లక్ష్యం ఏంటనేది కూడా సినిమాలో వివరించారు. బిగ్ డాడీ చివరకు తన లక్ష్యాన్ని చేరుకోవడం, ఎలా చేరుకున్నాడు అనేదాన్ని చాలా ఆసక్తికరంగా చూపెట్టారు. తెలుగులో ఈ సినిమా వచ్చిపోయింది ఎవరికీ తెలియకపోయినా.. కన్నడలో మాత్రం సినిమా హిట్టుగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలోనే కలెక్షన్లను రాబట్టుకుంది. మరి ఈ హిట్టు చిత్రాన్ని ఓటీటీ వేదికగా చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











