OTT ఓటీటీలోకి 100 శాతం లాభాలతో పునీత్ రాజ్‌కుమార్ వారసుడి మూవీ.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
కన్నడ సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి సినీ వారసుడిగా యువ అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో యువ రాజ్‌కుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిలీజ్‌కు ముందు ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి అనూహ్యమైన క్రేజ్ లభించింది. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు కావడంతో అన్ని వర్గాల ఆడియెన్స్ అక్కున చేర్చుకొన్నారు. కన్నడ బాక్సాఫీస్ వద్ద హంగామా చేసిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
యువ చిత్రాన్ని అట్టహాసంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్ని ఖర్చులతో కలిపి 11 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక సినిమా థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా బడ్జెట్‌కు సమానంగా థియేట్రికల్ రైట్స్ అమ్మడం జరిగింది. సుమారుగా 11 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ లాభాలను సాధించింది.

కన్నడ బాక్సాఫీస్ వద్ద యువ చిత్రం ఆరు వారాలపాటు కలెక్షన్ల యాత్రను కొనసాగించింది. కన్నడలో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 20 కోట్ల గ్రాస్, 15 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 24 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సుమారుగా ఈ సినిమా 4 కోట్ల రూపాయల లాభాన్ని రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఈ మూవీ శాటిలైట్, ఓటీటీ రైట్స్‌ను భారీ ధర చెల్లించి ప్రముఖ టెలివిజన్ ఛానెల్, ఓటీటీ సంస్థ దక్కించుకొన్నది. దాంతో ఈ సినిమా మరింత ప్రాఫిట్స్‌ను సొంతం చేసుకొన్నది. ఇలా 100 శాతం లాభాలను సొంతం చేసుకొన్న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది.
కన్నడ పరిశ్రమలో ఓటీటీ రిలీజ్ విషయంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ సినిమా మే 10 తేదీన గానీ, మే 17వ తేదీన గానీ స్ట్రీమింగ్ కానున్నది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది. థియేట్రికల్‌గా హల్‌చల్ సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా విశేషంగా ఆకర్షిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











