OTTలోకి సూపర్ స్టార్ చివరి సినిమా... ఎందులో చూడాలంటే?

కన్నడ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన కన్నడంలో నటించిన చివరి సినిమా గంధడ గుడి. డాక్యూమెంటరీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజ్ అయి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయగా.. కొద్దిరోజులకు పలు కారణాలతో తొలగించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే....

పునీత్ రాజ్ కుమార్... కన్నడ సూపర్ స్టార్ గా ఆయన పేరు పొందారు. ఇక ఆయన ఎన్నో చిత్రాలతో అక్కడి ప్రేక్షకులను అలరించాడు. తెలుగులోనూ ఆయన సినిమాలు డబ్ అయ్యాయి. ఇక మన సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రాలను ఆయన కన్నడంలో రీమేక్ చేసి హిట్ కొట్టిన సందర్బాలు ఉన్నాయి. ఒక్కడు, దూకుడు వంటి చిత్రాలను పునీత్ రాజ్ కుమార్ రీమేక్ చేసి హిట్ అందుకున్నారు.

Kannada Superstar Puneeth Rajkumar Gandhada Gudi is Now Streaming on Digital Platforms

ఇక పునీత్ రాజ్ కుమార్ 2021లో అక్టోబర్ 29న ఎక్స్ సైజ్ చేస్తూ.. జిమ్ లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్తే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే పునీత్ మరణం చిత్ర పరిశ్రమకు ఇప్పటికీ తీరనీ లోటే. ఇక ఆయన నటించిన చివరి చిత్రం గంధడ గుడి. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ ఈ చిత్రానికి 10కి 9.3 రేటింగ్ కూడా ఇచ్చింది.

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొద్దిరోజులు స్ట్రీమింగ్ అయింది. కానీ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ ఫారమ్ నుంచి తొలగించింది. అయితే ఈ సినిమా ఇప్పుడు పలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. గంఢద గుడి చిత్రం YouTube, Google TV, ITunes/ Apple TVలో వంటి వాటిల్లో రెంటల్ విధానాల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను చూడాలంటే... 100 రూపాయలు పెట్టి అద్దెకు తీసుకుని చూడవచ్చు.

అయితే గంధడ గుడి చిత్రం అమెజాన్ నుంచి తీసివేయడానికి కారణం ఏంటంటే... టైటిల్ లైసెన్స్ గడువు ముగిసిందని, అందుకే తమ ప్లాట్‌ఫారమ్ నుండి సినిమాను తీసివేయాల్సి వచ్చిందని అమెజాన్ పేర్కొంది. ఇక ఈ సినిమా 98 నిమిషాలు గల ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఇక పునీత్ ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్‌ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు కూడా.

గంధడ గుడి డాక్యూమెంటరీ పూర్తయిన తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలోనే పునీత్ కన్నుమూశారు. 2022 అక్టోబరు 28న ఈ డాక్యూమెంటరీ పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేయగా... ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. పీఆర్కే ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ డాక్యూమెంటరీని అమోఘవర్ష జేఎస్ దర్శకత్వం వహించగా... అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X