Kannappa OTT: కన్నప్ప ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? స్ట్రీమింగ్‌పై మంచు విష్ణు షాకింగ్ డెసిషన్!
మంచు ఫ్యామిలీ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, బ్రాహ్మణ సంఘాల నిరసనలు, చివరిలో జీఎస్టీ అధికారుల దాడులు.. ఇలా అన్నింటినీ దాటుకుని మంచువారి కన్నప్ప చిత్రం రిలీజైంది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్ కోసం ఎంతో కష్టపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించి కన్నప్పపై భారీ హైప్ తీసుకొచ్చారు. కన్నప్ప రిజల్ట్ ఏంటో ఈరోజుతో తేలిపోతుంది. మరోవైపు.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పైనా ప్రేక్షకులు అప్పుడే డిస్కషన్స్ మొదలుపెట్టేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
భారీ తారాగణంతో కన్నప్ప
కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషి, మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటర్‌గా పనిచేశారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ , స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం.

కన్నప్ప మూవీ బడ్జెట్ ఎంత?
న్యూజిలాండ్‌లోనే ఎక్కవ భాగం చిత్రీకరణ జరుపుకుంది కన్నప్ప చిత్రం. ఆ దేశంలోని ఓ ప్రాంతంలో 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్ట్‌ను లీజుకు తీసుకుని మరి షూటింగ్ నిర్వహించి చిత్ర యూనిట్ సాహసం చేసిందని చెప్పొచ్చు. టెక్నికల్ వాల్యూస్, స్టాండర్డ్స్ తగ్గకుండా రిచ్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు మోహన్ బాబు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప సినిమాకు దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం అయినట్లు ఫిలింనగర్ టాక్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేశారు.
కన్నప్ప డిస్ట్రిబ్యూషన్ & బిజినెస్
భారీ స్టార్ క్యాస్టింగ్, టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తుండటం కూడా కన్నప్పపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే సినిమాను తానే సొంతంగా విడుదల చేయాలని మంచు విష్ణు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. కేరళలో మోహన్ లాల్‌కి చెందిన ఆశీర్వాద్ పిక్చర్స్, హిందీలో జయంతీలాల్ గడా, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, కర్ణాటకలో రాక్‌లైన్ వెంకటేష్, నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ సంస్థలు కన్నప్ప చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000, ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పును గ్రాండ్‌గా విడుదల చేశారు. అయితే కన్నప్ప చిత్రం క్లీన్ హిట్ కావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కన్నప్ప ఓటీటీ స్ట్రీమింగ్‌పై విష్ణు వ్యాఖ్యలు
ఇదిలాఉండగా.. కన్నప్ప చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని మంచు వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కన్నప్ప ఓటీటీ స్ట్రీమింగ్‌పై హీరో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్‌లలో విడుదలైన 10 వారాల వరకు కన్నప్ప చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాదని క్లారిటీ ఇచ్చారు. అలా ఓటీటీ సంస్థతో డీల్ కుదుర్చుకున్నానని.. ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాలన్నదే తన లక్ష్యమని విష్ణు తెలిపారు. దేవుడి దయ వల్ల ఆ ఓటీటీ రిలీజ్ ప్రెజర్ లేదని ఆయన చెప్పారు. సో.. 10 వారాల వరకు కన్నప్ప ఓటీటీలో రిలీజ్ కాదని తేలిపోయింది. అయితే త్వరలోనే కన్నప్ప ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











