Kannappa OTT: ఓటీటీలోకి కన్నప్ప.. మంచు విష్ణు మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం కావడంతో పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో తిరిగి ట్రాక్‌లోకి వచ్చేందుకు మంచు విష్ణు రిస్క్ తీసుకున్నారు. తెలుగువారికి బాగా పరిచయమైన మహా శివభక్తుడు కన్నప్ప జీవిత కథ ఆథారంగా నిర్మించిన చిత్రమే కన్నప్ప. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
కన్నప్ప తారాగాణం
బాలీవుడ్‌లో మహాభారత్ తదితర భారీ సీరియల్స్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్.. ఈ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషి, మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి సూపర్‌స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. స్టీఫెన్ దేవస్సీ సంగీత సారథ్యం వహించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కన్నప్ప మూవీ బడ్జెట్ ఎంత?
నేచురల్ ఫీలింగ్ తెప్పించడానికి న్యూజిలాండ్‌లోనే దాదాపు 80 శాతం వరకు కన్నప్ప సినిమా షూటింగ్ జరుపుకుంది కన్నప్ప. సుమారు 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్ట్‌ను లీజుకు తీసుకుని.. క్యాస్ట్ అండ్ క్రూకి వసతి ఏర్పాట్లు చేసి షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు మోహన్ బాబు. పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మాణ విలువలు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు మోహన్ బాబు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప మూవీకి దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000, ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పును గ్రాండ్‌గా విడుదల చేశారు.
కన్నప్ప బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
భారీ స్టార్ క్యాస్టింగ్, టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలను మించి పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ కీలకపాత్ర పోషించడంతో కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణంగా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమాను తానే సొంతంగా విడుదల చేయాలని మంచు విష్ణు సాహసం చేశారు. కేరళలో మోహన్ లాల్‌కి చెందిన ఆశీర్వాద్ పిక్చర్స్, హిందీలో జయంతీలాల్ గడా, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, కర్ణాటకలో రాక్‌లైన్ వెంకటేష్, నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ సంస్థలు కన్నప్ప చిత్రాన్ని పంపిణీ చేశాయి. మంచు విష్ణు మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ కట్టాయి.
కన్నప్ప వసూళ్లు
కన్నప్ప తెలుగు రాష్ట్రాల్లో 26.98 కోట్ల రూపాయలు.. తమిళంలో 77 లక్షల రూపాయలు, హిందీలో 3.97 కోట్ల రూపాయలు, కన్నడంలో 28 లక్షలు రూపాయలు, మలయాళంలో 73 లక్షల రూపాయలు చొప్పున మొత్తంగా ఇండియా వైడ్ రూ.32.73 కోట్ల నెట్..37 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో 5.10 కోట్ల రూపాయలు కలిపి ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప చిత్రం రూ.42.12 కోట్లు వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా నిర్మాతలకు దాదాపు 110 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది.
కన్నప్ప ఓటీటీ వివరాలు
తొలుత ఈ సినిమాకు ఓటీటీ డీల్ ఫినిష్ కాలేదు. థియేటర్‌లో విడుదలైన 10 వారాల వరకు కన్నప్పను ఓటీటీలోకి విడుదల చేయడం లేదని చెప్పారు మంచు విష్ణు. అయితే ప్రస్తుతం కన్నప్ప థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ డీల్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. తాజాగా కన్నప్ప డిజిటల్ స్ట్రీమింగ్‌పై అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చింది. జూలై 25 నుంచి కన్నప్ప చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో కన్నప్ప ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











