twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara Vs Ponniyin Selvan ఓటీటీలో నువ్వా? నేనా? అమెజాన్‌లో భారీ ఫైట్.. రిలీజ్ ఎప్పుడంటే?

    |

    ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా పొన్నియన్ సెల్వన్ 1, కంతారా సినిమాలు పోటీ పడ్డాయి. తమిళంలో పొన్నియన్ సెల్వన్ సునామీల కలెక్షన్లు సాధిస్తే.. కన్నడలో కంతారా చిత్రం వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 30 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకొన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు మరోసారి పోటీకి దిగనున్నాయి. ఈ పోటీ వివరాల్లోకి వెళితే..

    Ponniyin Selvan

    పొన్నియన్ సెల్వన్ 1 చిత్రం, కంతారా మూవీ నవంబర్ 4వ తేదీన ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోవడం విశేషంగా మారింది. దాంతో ఈ రెండు సినిమాలు అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవ్వడం ద్వారా పోటీ పడనున్నాయి.

    కంతార చిత్రం 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. గత ఐదు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద స్వైర విహారం చేస్తున్నది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

    పొన్నియన్ సెల్వన్ విషయానికి వస్తే.. 500 కోట్ల రూపాయలతో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. కల్కి కృష్ణమూర్తి రచించిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

    English summary
    Kantara and Ponniyin Selvan to release on Amazon prime Video on November 4th. These two movies are released on September 30th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X