Kara OTT: కర ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ధనుష్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో చూడొచ్చంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, యంగ్ హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన మూవీ కర. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ బ్యానర్‌పై ఇషారీ కే గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్వకత్వం వహించారు. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ కీలకపాత్ర పోషించారు. కరుణాస్, జయరామ్, పృథ్వీ రాజన్, సూరజ్ వెంజారమూడు, శ్రీజ రవి తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించగా.. థేనీ ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కర సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది. ఈ వివరాలు పరిశీలిస్తే..

కర బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి కర సినిమాను 140 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ టాక్. ధనుష్ క్రేజ్‌కు తోడు టీజర్, ట్రైలర్‌లతో కర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కర మూవీకి సంబంధించి తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని రెడ్ జెయింట్ మూవీస్ దక్కించుకుంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు అయ్యంగారన్ ఇంటర్నేషన్ సంస్థ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది.

Kara OTT Release When And Where To Watch Dhanush s Movie Online After Theatrical Run

కర డిస్ట్రిబ్యూషన్ డిటెయిల్స్
జన నాయగన్, జైలర్ 2 సినిమాలకు సంబంధించిన ఫుటేజ్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో కర చిత్ర యూనిట్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఆన్‌లైన్ స్టోరేజ్ సర్వీసుల నుంచి కర మూవీని తొలగించినట్లు దర్శకుడు విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. కర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు సొంతం చేసుకుంది. అయితే డీల్ వాల్యూ ఎంత అన్నది మాత్రం బయటకు తెలియరాలేదు. కర మూవీ శాటిలైట్ రైట్స్‌ని విజయ్ టీవీ దక్కించుకుంది.

అడ్వాన్స్‌ బుకింగ్‌లో కర హవా
ఇక అడ్వాన్స్ బుకింగ్‌లో కరకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ఇప్పటి వరకు తమిళనాడులో 1847 షోలకు గాను 1.63 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 827 షోలకు గాను 34.78 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా ఇండియా వైడ్‌గా తొలిరోజు 410 సెంటర్స్‌లో 1065 స్క్రీన్‌లలో 4062 షోలకు గాను 1,75,205 టికెట్లు అమ్ముడై ఇప్పటి వరకు 2.42 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

కర ఓటీటీ డిటెయిల్స్
థియేటర్‌లోకి విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత కర మూవీ ఓటీటీలోకి రావాలనే నిబంధన మేరకు నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇటీవల దక్షిణ భారత చలనచిత్ర నిర్మాతల మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద సినిమాలు 8 వారాల తర్వాతే థియేటర్ల నుంచి ఓటీటీలోకి రావాలని కండీషన్ పెట్టింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే కర మూవీ జూన్ చివరి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి కర మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆధారపడి ఉంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read more about: dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X