twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్లల్ని కన్న తర్వాత క్వాలిటీ శృంగారం చేస్తున్నావా? కరీనాకు కరణ్ ప్రశ్న.. మీ అమ్మ షో చూస్తుందంటూ వార్నింగ్

    |

    బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతున్నది. తన షోకు వస్తున్న సెలబ్రీటలను అడల్ట్ ప్రశ్నలతో కంగారు పుట్టిస్తున్నారు. అనన్య పాండేతో కరణ్ మాట్లాడుతూ నీవు ఎప్పుడు సెక్స్‌లో పాల్గొన్నావు అనే ప్రశ్నను సంధించిన హోస్ట్ తాజాగా కరీనా కపూర్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్నను సంధించాడు. తాజా డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్న తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    కాఫీ విత్ కరణ్ 5వ ఎపిసోడ్‌లో

    కాఫీ విత్ కరణ్ 5వ ఎపిసోడ్‌లో

    కాఫీ విత్ కరణ్ సీజన్ షో ఇటీవలే ప్రారంభమైంది. ఈ షోలో రణ్‌వీర్ సింగ్-ఆలియాభట్, సారా ఆలీ ఖాన్-జాన్వీ కపూర్, అక్షయ్ కుమార్-సమంత రుత్ ప్రభు, విజయ్ దేవరకొండ-అనన్య పాండే పాల్గొన్నారు. తాజాగా కరీనా కపూర్‌తో అమీర్ ఖాన్ గెస్టులుగా షోలో హాజరయ్యారు.

    సంతానం తర్వాత శృంగారం గురించి

    సంతానం తర్వాత శృంగారం గురించి

    కరీనా కపూర్‌తో కరణ్ జోహర్ మాట్లాడుతూ.. పిల్లలు పుట్టిన తర్వాత నాణ్యమైన శృంగారం చేయడమనేది కష్టం. సంతానం తర్వాత సెక్స్‌లో క్వాలిటీ ఉండదంటారు? అది నిజమేనా అని అడిగితే.. ఏం ప్రశ్న అడుగుతున్నావు. ఈ షో నీ తల్లి చూస్తుంది జాగ్రత్త అంటూ కరీనా కపూర్ హెచ్చరించింది. ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకు అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది.

    మీ అమ్మ చూస్తున్నందంటూ

    మీ అమ్మ చూస్తున్నందంటూ

    అయితే క్వాలిటీ సెక్స్ విషయంపై కరీనా, కరణ్‌కు మధ్య జరుగుతున్న సంభాషణలో అమీర్ జోక్యం చేసుకొన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే కరణ్ తల్లి పెద్దగా పట్టించుకోదు. ఇతరుల జీవితంలో శృంగారం గురించి అడగడం, కరణ్ దృష్టిపెట్టడం కొత్తేమీ కాదు కదా అనే విధంగా అమీర్ ఖాన్ అన్నారు.

    ఆ విషయంలో అమీర్ అంటే భరించడం కష్టం

    ఆ విషయంలో అమీర్ అంటే భరించడం కష్టం

    ఇక అమీర్ ఖాన్‌ను ఏ విషయంలో భరించడం కష్టం అనే ప్రశ్నకు కరీనా కపూర్ తడబడింది. సాధారణంగా అమీర్ ఖాన్ ఒక్కో సినిమాను 200 రోజులపాటు షూట్ చేస్తారు. అదే అక్షయ్ కుమార్ అయితే 30 రోజుల్లో ఒక్కో సినిమా పూర్తి చేస్తారు. అమీర్ ఒక్క సినిమా చేస్తే అక్షయ్ మూడు సినిమాలు ఫినిష్ చేస్తారు. అమీర్ విషయంలో ఇదే నేను భరించలేనిది అంటూ కరీనా సమాధానం చెప్పింది.

    లాల్ సింగ్ చడ్డా గురించి అమీర్ ఖాన్

    లాల్ సింగ్ చడ్డా గురించి అమీర్ ఖాన్

    ఇక లాల్ సింగ్ చడ్డా సినిమా గురించి మాట్లాడుతూ.. ఫారెస్ట్ గంప్ సినిమా తీయడానికి 14 ఏళ్లు పట్టింది. జానే తూ జానే నా సినిమా సమయంలో అద్వైత్ స్క్రిప్టు రాశాడు. కానీ నేను రెండు సంవత్సరాల పాటు ఆ స్క్రిప్టు వినలేదు. ఒకసారి విన్న తర్వాత వెంటనే లాల్ సింగ్ చడ్డా సినిమాను తీయాలని డిసైడ్ అయ్యాను. కానీ హక్కులు పొందడానికి 8 ఏళ్లు పట్టింది అని అమీర్ ఖాన్ అన్నారు.

     22 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ జరగలేదు అలా

    22 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ జరగలేదు అలా

    అయితే కాఫీ విత్ కరణ్‌ షోలో కరీనా కపూర్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. తన 22 ఏళ్ల కెరీర్‌లో నాకు ఎప్పుడు ఎన్నడూ స్క్రీన్ టెస్ట్ చేయలేదు. కానీ అమీర్ ఖాన్ మాత్రం లాల్ సింగ్ చద్దాకు స్క్రీన్ టెస్ట్ చేశాడు అని కరీనా చెప్పింది. అయితే స్క్రీన్ టెస్ట్ చేద్దామని అనుకొన్నాం. కానీ కొన్ని డైలాగ్స్ చదివిన తర్వాత రూప పాత్రను కరీనా తప్ప మరొకరు చేయలేరని డిసైడ్ అయ్యాను అని అమీర్ తెలిపారు.

    English summary
    Bollywood star Kareena Kapoor and Aamir Khan has joined in Karan Johar's Koffee with Karan 7 show. Karan johar tricky question for Kareena Kapoor, Here are details of show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X