OTTలోకి కరీనా కపూర్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ..ఈ కామెడీ డ్రామాను ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వస్తూ తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్ల సినిమాలు కూడా నెల తిరిగిలోపే.. మహా అయితే రెండు నెలల కాగానే వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా ముగ్గురు స్టార్ హీరోయిన్లు కలిసి నటించిన ఓ క్రేజీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఈ సినిమా ఏంటి ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముగ్గురు స్టార్ హీరోయిన్లు కలిసి చేసిన క్రేజీ మూవీయే క్రూ. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్ నెట్‌వర్క్ బ్యానర్‌లపై ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు.ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు ఈ సినిమాలో దిల్జీద్ దోసాంజ్, కపిల్ శర్మ, పూజా భమ్రా, కులభూషణ్ ఖర్బందా, లారీ న్యూయార్కర్, శాశ్వత ఛర్జీ, రోహిత్ చెత్రీ, అహ్మద్ కబీల్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

అలాగే ఈ సినిమాకు అనుజ్ రాకేష్ ధావన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. జాన్ స్టీవర్ట్ ఎడూరి సంగీతం అదించారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. క్రూ సినిమా మే 29వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి.. మొత్తంగా 125 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.

అయితే ఈ క్రేజీ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేని వాళ్లంతా ఓటీటీ వేదికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఎక్స్ వేదికగా ప్రకటించింది. మే 28వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం ఈ క్రేజీ మూవీని ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











