ఓటీటీలోకి కరీనా కపూర్ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఎప్పుడు రిలీజ్? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
బాలీవుడ్‌లో టాప్ కలెక్షన్లను సాధించిన చిత్రాల్లో క్రూ మూవీ ఒకటి. బడా హీరోలందరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే.. టాప్ హీరోయిన్లు కరీనా కపూర్, కృతిసనన్, టబు నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఏక్తా కపూర్, అనిల్ కపూర్ నిర్మించిన ఈ సినిమా దాదాపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అనే ఎదురు చూసే ప్రేక్షకుల కోసం ఆ మూవీ రిలీజ్ వివరాలు మీ కోసం..
లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ట్రేడ్ వర్గాల అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది. ఇక ఈ సినిమా దాదాపు రెండు వారాలకుపైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది.

క్రూ సినిమా మార్చి 29న థియేట్రికల్ రిలీజై భారీ లాభాలను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా ఇండియాలో 70 కోట్లకుపైగా నికర వసూళ్లను, 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 125 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. కరీనా కపూర్ నటించిన హీరోయిన్, వీర్ దే వెడ్డింగ్ సినిమాలతోపాటు ఈ మూవీ కూడా భారీ వసూళ్లను రాబట్టడం ఆమె స్టార్ డమ్‌కు అద్దం పట్టింది.
థియేటర్‌లో ఈ మూవీని చూడలేని ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్‌లో ఏదైనా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే.. విడుదలైన 60 రోజుల వరకు తప్పనిసరిగా ఆగాల్సిందే అనే కఠినమైన నిబంధన ఉంది. దాంతో నిబంధనల ప్రకారం.. ఈ సినిమా మే చివరి వారంలో రీలీజ్ అవుతుంది.

ఇక క్రూ మూవీ ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం.. ఈ మూవీ మే 31వ తేదీన ఓటీటీలోకి వస్తుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొన్నది. ఈ సినిమా మే నెల చివరి రోజున రిలీజ్ అవుతుందని ఓటీటీ అనలిస్టులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











