Karimnagar's Most Wanted: ఆహాలో "కరీనంగర్స్ మోస్ట్ వాంటెడ్" వెబ్ సిరీస్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మధ్య కాలంలో థియేటర్ల వద్దకు వెళ్లి సినిమాలు చూడండం కంటే కూడా ఇంట్లోనే కూర్చొని ఓటీటీల్లో తమకు నచ్చిన సినిమాలను చూసేస్తున్నారు. అలాగే ఈ మధ్య ఓటీటీ సంస్థలు.. అద్బుతమైన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ విపరీతంగా అలరిస్తున్నారు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేధికగా వచ్చిన నాగచైతన్య దూత వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న నటీనటుల నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు అంతా వెబ్ సిరీస్ లు చేసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా మరో వెబ్ సిరీస్ రాబోతుంది. అయితే పక్కా లోకల్ సిరీస్ వస్తున్న ఆ వెబ్ సిరీస్ ఏంటి ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా తాజాగా ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసింది. పొలిటికలకల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ "కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్". స్ట్రీట్ బీట్జ్ సినిమా నిర్మాణంలో భువనగిరి దర్శకతవం వహించిన ఈ వెబ్ సిరీస్ కు సాహిత్య సాగర్ మ్యూజిక్ అందించారు. రమేష్ ఎలిగేటి కథ, స్క్రీన్ ప్లే అందించగా.. విజయ్ వర్ధన్ కే ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. అందులో అచ్చమైన కరీంనగర్ యాస, భాషతో అదరగొట్టారు.

అయితే ఈ వెబ్ సిరీస్ కోసం కరీంనగర్ కు చెందిన చాలా మంది నటీటులనే తీసుకున్నారట. సాయి, అమన్ సూరేపల్లి, సాసా, బాలాజీలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. గీ రాజకీయాల్లో గెలుసుడో, ఓడుడో డిసైడ్ చేసేది గీ పైసల్ అంటూ చెప్పే డైలాగ్ చూస్తుంటేనే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో అర్థం అయిపోతుంది. అలాగే ఏ దందాల్నైనా అచ్చే పైసల్ చూస్తవా.. ఇచ్చెటోని మొహం చూస్తవా అంటూ వచ్చిన డైలాగ్ కూడా అదిరిపోయింది.
అలాగే ప్రకాశం గంజ్ ల, క్లాక్ టవర్ కాడ, బోయగూడ గణేష్ కాడ ఎన్ని పోట్లు పొడుచుకుంట పైకొచ్చిన్నో.. గన్ని పోట్లు తిని గీడికచ్చినరా అంటూ రాజకీయ నాయకుడు చెప్పిన తీరు చూస్తుంటే.. రౌడీయే రాజకీయ నాయకుడు అయినట్లు అర్థం అవుతుంది. అలాగే ఓ ఐదుగురు యువకులు.. ఐదు కోట్ల బ్యాంక్ స్కాంలో అరెస్ట్ అవడం.. అందరితో గొడవలు పెట్టుకుంటూ రౌడీయింజం చేస్తూ.. కోట్ల సంపాధిస్తారు. పక్కా లోకల్ లాంగ్వేజీలో ఉన్న ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉండబోతుందని చూస్తుంటేనే తెలుస్తోంది. కరీంనగర్ ల ఎవ్వరి మీద ఎవ్వరు తోపు కాదన్నా అంటూ చివర్లో వచ్చిన డైలాగ్ కూడా చాలా బాగుంది.

పూర్తి తెలంగాణ నేపథ్యంలో వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. అచ్చమైన తెలంగాణ భాషలో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. డిసెంబర్ 22వ తేదీన నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెబ్ సిరీస్ మేకర్స్ ప్రకటించారు. మరో రెండు రోజుల్లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను ఓసారి చూసి ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











