Satyam Sundaram OTT: ఓటీటీలో బావ బామ్మర్దిల ఎమోషనల్ మూవీ.. కార్తీ, అరవింద్ స్వామి మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Satyam Sundaram OTT Update: తమిళ నటులు కార్తీ, అరవింద్ స్వామి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సత్యం సుందరం (Satyam Sundaram ). 96 మూవీ ఫేమ్ దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ ఎమోషన్స్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తెరకెక్కిన ఈ మూవీకి సౌత్ ఇండియాలో స్టార్ హీరో, హీరోయిన్లు సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ బ్లాక్ బాస్టర్ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ సత్యం సుందరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోందో ఓ లూక్కేయండి.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ 'దేవరకు పోటీగా వచ్చిన వచ్చిన మూవీ సత్యం సుందరం. ఈ మూవీ తెలుగులో కూడా డీసెంట్ హిట్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరోస్ కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్ లో నటించిన ఫీల్ గుడ్ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఈ చిత్రాన్ని హీరో సూర్య, జ్యోతిక అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించారు.

Karthi and Arvind Swamy s Emotional Drama satyam sundaram ott streaming from october 27th in netflix

బావ బామ్మర్దిల ఎమోషనల్ మూవీ సత్యం సుందరం సెప్టెంబర్ 27న తమిళంలో, 28న తెలుగులో విడుదలైంది. అయినా.. బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది.కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.బాక్సాఫీస్ దగ్గర రూ. 60 కోట్లకుపైగా వసూలు చేయడంతోపాటు ఐఎండీబీలోనూ 8.4 రేటింగ్ సాధించింది.

ఈ మూవీలో కార్తి, అరవింద్ స్వామిలు బావ బామ్మర్దిలు చక్కని ఎమోషనల్ పండించారు.వారిద్దరూ తమ నటనతో అడియన్స్ హృదయాలను కొల్లగొట్టారు.ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. వాస్తవానికి సత్యం సుందరం సినిమాలో పాటలు ఎక్కువగా లేవు. అలాగే.. యాక్షన్ ఫైట్ సీన్స్ కూడా అంతగా లేవు. ఈ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథలో ఎలాంటి ట్విస్టులు లేకున్నా 3 గంటలపాటు ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు.

Karthi and Arvind Swamy s Emotional Drama satyam sundaram ott streaming from october 27th in netflix

రీసెంట్ బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ సత్యం సుందరం (మేయళగన్)ఓటీటీ అప్టేట్ వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ థియేటర్లో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అంటే.. ఈ మూవీ అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. 96 మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమిళ, తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X