Sardar OTT: కార్తీ సూపర్ హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో వచ్చేది అప్పుడే!
తమిళ హీరో కార్తీ చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మరో మంచి విజయాన్ని అందుకున్నాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ తో అతని మార్కెట్ స్థాయిని పెంచింది. ఖైదీ తర్వాత కార్తీ మళ్లీ అలాంటి విజయాన్ని చూడలేని కార్తికి సర్దార్ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో అతని నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా కార్తీ ఒకే సినిమాలో విభిన్నమైన పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా మంచి ప్రాఫిట్స్ అందించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలుగులో కూడా సరైన విజయం లేక కార్తీ సతమతమవుతున్నాడు. ఇక సర్దార్ ద్వారా అతనికి ఆ కోరిక కూడా తీరింది. అయితే ఇప్పుడు ఓటీటీ లో కూడా విడుదలయితే సినిమాను చూడాలని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఇప్పుడు సినిమాను నవంబర్ 24వ తేదీన ఆహా తమిళ్ లో విడుదల చేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో మరొక వారం ఆలస్యంగా నవంబర్ చివరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్. తెలుగు వెర్షన్ కూడా ఆహలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న కార్తి మరి ఈ సినిమా ద్వారా ఓటీటీలో కూడా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











