Japan OTT: ఫేమస్ ఓటీటీలో కార్తి సినిమా.. స్ట్రీమింగ్ అన్ని రోజులకేనా!

విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో కార్తి. సూర్య తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు.

కొంత కాలంగా డిఫరెంట్ సినిమాలతో సత్తా చాటుతోన్న కార్తి ఇప్పుడు 'జపాన్' అనే సినిమాలో నటించాడు. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని 'జోకర్', 'మండేలా' ఫేం రాజు మురుగన్ తెరకెక్కించాడు. విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా ఈరోజే (నవంబర్ 10వ తేదీ) ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Karthi Starrer Japan Movie Digital Streaming Details Revealed

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'జపాన్' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వస్తోంది. అలాగే, తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కూడా ఇదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే లభిస్తోంది. అన్ని చోట్లా ఈ సినిమా షోలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

'జపాన్' సినిమా సందడి థియేటర్లలో మొదలు అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా న్యూస్ తెలిసింది.

Karthi Starrer Japan Movie Digital Streaming Details Revealed

కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన 'జపాన్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే నవంబర్ 10వ తేదీన విడుదలైన 'జపాన్' చిత్రం డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'జపాన్' మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్ కీలక పాత్రను చేశాడు. ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X