Japan OTT: ఓటీటీలోకి కార్తి కామెడీ మూవీ.. వామ్మో ఆ సీన్స్ కూడా చూపిస్తారా!
తమిళ చిత్ర పరిశ్రమలోని కొందరు హీరోలకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడ్డాయి. అలాంటి వారిలో విలక్షణ నటుడు కార్తి ఒకడు. ప్రతి సినిమాకూ తనలోని వైవిధ్యమైన నటనను చూపించడంతో పాటు రేంజ్‌ను పెంచుకుంటోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇటీవలే కార్తి 'జపాన్'గా వచ్చేశాడు.
ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న కార్తి ఇటీవలే 'జపాన్' అనే సినిమాలో నటించాడు. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని 'జోకర్', 'మండేలా' ఫేం రాజు మురుగన్ తెరకెక్కించాడు. విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా నవంబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

కార్తి హీరోగా క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'జపాన్' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వస్తోంది. అలాగే, తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కూడా ఇదే కంటిన్యూ అయింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా తక్కువగానే వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు చాలా డల్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రం భారీ నష్టాలతో డిజాస్టర్ అయింది.
'జపాన్' సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా న్యూస్ తెలిసింది.

కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన 'జపాన్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఇది డిజాస్టర్ అవడంతో ముందే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ చిత్రాన్ని డిసెంబర్ 11వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఇందులో సెన్సార్ అయిన సన్నివేశాలను కూడా యాడ్ చేయబోతున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'జపాన్' మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్ కీలక పాత్రను చేశాడు. ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్‌ను అందించాడు.


Click it and Unblock the Notifications











