OTTలోకి రాబోతున్న సూపర్ హిట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?
ఈ ముధ్య కాలంలో ఎక్కువగా సస్పెన్ థ్రిల్లర్ లు, క్రైమ్ థ్రిల్లర్ లు ఎక్కువగా జనాలను ఆకట్టుకుంటున్నాయి. నార్మల్ డ్రామా చిత్రాల కంటే కూడా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎక్కువగా ఇంలాటి చిత్రాలే ఈ మధ్య సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ అద్భుతమైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా వచ్చింది. థియేటర్ల వద్ద సినిమా ఫర్వాలేదనిపించింది కూడా. కానీ పెద్ద సినిమాల హవా ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది. అయితే ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో వచ్చిన తాజా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అథర్వ. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ ఒకటవ తేదీనే గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయింది. పాజిటివ్ టాక్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. అలాగే కిరణ్ మచ్చ, మరిముత్తు, కల్పిక గణేష్, ఆర్య వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. శ్రీచరణ్ పాకాలా ఈ సినిమాకు సంగీతం అందించగా.. కాసర్ల శ్యామ్, కిట్టు విస్సాప్రగడలు లిరిక్ రైటర్ లుగా పని చేశారు.

అలాగే చరణ్ మాధవనేని సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ ఒకటో తేదీన విడుదలై మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ వేధికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని.. నేరుగా ఆ సంస్థే ఎక్స్ వేధికగా ప్రకటించింది. అయితే జనవరి 25వ తేదీ నుంచి ఈ సినిమా అన్ని భాషల్లో అందుబాటులోకి రాబోతుందని స్పష్టం చేసింది.

క్లూస్ డిపార్ట్ మెంట్ లో ఉండే ఓ పోలీస్ ఆఫీసర్ ఓ మిస్టరీ మర్డర్ కేసును సాల్వ్ చేస్తుంటారు. ఎన్నో చిక్కు ప్రశ్నలను ఎదుర్కుంటూ అసలు నేరస్థుడు ఎవరో పట్టుకుంటారు. అద్భుతమైన ట్విస్ట్ లతో తెరకెక్కించిన ఈ సినిమా కచ్చితంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుంద అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్భుతమైన థ్రిల్లర్ గా నిలిచిన ఈ సినిమాను జనవరి 25వ తేదీ నుంచి హాయిగా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ చూడండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











