ఓటీటీలోకి 140 కోట్ల స్పోర్ట్స్ మూవీ.. ప్రభాస్ దెబ్బతో ముందుగానే!

ఒకప్పుడు బయోపిక్ మూవీలు చేయాలంటే హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఆలోచించే వారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఇలాంటి చిత్రాలు చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ తరహాలో ఎన్నో మూవీలు వచ్చి ప్రేక్షకుల మెప్పును అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన మరో బయోపిక్ సినిమానే 'చందు ఛాంపియన్'.

బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ హీరోగా.. కబీర్ ఖాన్ రూపొందించిన స్పోర్ట్స్ డ్రామానే 'చందు ఛాంపియన్'. ఓ అథ్లెట్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని జూన్ 14వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Kartik Aaryan Starrer Chandu Champion Movie Streaming Start Before 30 Days On Amazon Prime

ఎమోషనల్ స్టోర్ట్స్ డ్రామాగా రూపొందిన 'చందు ఛాంపియన్' సినిమాకు ఆరంభంలో వేసిన ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా రూ. 80 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది. తద్వారా హిట్ కోసం పోరాటం చేస్తోంది.

కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన 'చందు ఛాంపియన్' మూవీ విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఈ మూవీ హక్కులను దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అయింది.

Kartik Aaryan Starrer Chandu Champion Movie Streaming Start Before 30 Days On Amazon Prime

కార్తీక్ ఆర్యన్ నటించిన 'చందు ఛాంపియన్' మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమా ప్రభావంతో వసూళ్లను అంతగా రాబట్టలేకపోతోంది. ఫలితంగా దీన్ని అనుకున్న దానికంటే ముందుగానే అంటూ జూలై చివరి వారం నుంచి అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తెస్తుందని తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. కార్తీక్ ఆర్యన్ - కబీర్ ఖాన్ కలయికలో రూపొందిన 'చందు ఛాంపియన్' చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్లపై సాజిద్ నడియాద్వాలా, కబీర్ ఖాన్ నిర్మించారు. ఇందులో విజయ్ రాజ్, భువన్ అరోరా కీలక పాత్రల్లో నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి ప్రీతమ్, జూలియస్ ప్యాకిమం సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X