నెలలోపే ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఉత్కంఠను రేపే దీన్ని ఎక్కడ చూడాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే స్వయంకృషితో హీరోలుగా పరిచయమై.. తమదైన టాలెంట్లతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ ఒకడు. ఆరంభంలోనే క్రేజీ మూవీతో సెన్సేషన్ అయిన అతడు.. అప్పటి నుంచి ప్రయోగాలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే 'భజే వాయు వేగం' మూవీ చేశాడు.
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భజే వాయు వేగం'. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఇది బాగా హైలైట్ అయింది. ఫలితంగా భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుంది. దీంతో ఈ సినిమాను మే 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసుకున్నారు.

కార్తికేయ గుమ్మకొండ - ప్రశాంత్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'భజే వాయు వేగం' సినిమా ఎన్నో అంచనాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మొదటి ఆట నుంచి డీసెంట్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కానీ, తర్వాత అంతగా రాణించలేకపోవడంతో లాభాలను అందుకోలేదు.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'భజే వాయు వేగం' సినిమా నుంచి టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు మంచి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన 'భజే వాయు వేగం' సినిమాను థియేటర్లలో 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాను జూన్ 28 నుంచే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది. అంటే.. నెల రోజులు కూడా కాకుండానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పి సర్‌ప్రైజ్ చేసేసింది.
ఇదిలా ఉండగా.. కార్తికేయ గుమ్మకొండ హీరోగా ప్రశాంత్ రెడ్డి రూపొందించిన 'భజే వాయు వేగం' సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











