ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. టాలీవుడ్ యంగ్ హీరో మూవీని ఎలా చూడాలంటే!
టాలీవుడ్‌లో ఉన్న చాలా తక్కువ మంది టాలెంట్ ఉన్న కుర్ర హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు సరైన ఫిజిక్‌తో సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఫలితాలను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ హిట్ తర్వాత 'భజే వాయు వేగం' మూవీ చేశాడు.
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'భజే వాయు వేగం'. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ అంచనాలను ఏర్పరచుకుంది. దీంతో ఈ సినిమాను మే 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన 'భజే వాయు వేగం' సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కానీ, తర్వాత రాణించలేక ఏవరేజ్‌గానే రన్ ముగించింది.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'భజే వాయు వేగం' సినిమా నుంచి ప్రచార చిత్రాలు రావడంతో అంచనాలు బాగానే పెరుగుతూ వచ్చాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు మంచి పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన 'భజే వాయు వేగం' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను జూన్ 28 నుంచే ఓటీటీలోకి తీసుకు వస్తున్నారట. అంటే.. నెల రోజులు కూడా కాకుండానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. కార్తికేయ - ప్రశాంత్ రెడ్డి కలయికలో తెరకెక్కిన 'భజే వాయు వేగం' సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











