కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి భజే వాయు వేగం.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు హ్యాండ్సమ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ. దీనికితోడు మంచి మంచి ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇలా కొంత కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అతడు.. ఇప్పుడు 'భజే వాయు వేగం' అనే మూవీని చేశాడు.
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీనే 'భజే వాయు వేగం'. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. దీంతో ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా మంచి అంచనాలను ఏర్పరచుకుంది. దీంతో ఈ సినిమాను మే 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలోనే విడుదల చేశారు.

టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన 'భజే వాయు వేగం' సినిమా ఎన్నో అంచనాలతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ రెండు రోజుల్లోనూ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా డీసెంట్‌గానే రాబడుతోంది.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'భజే వాయు వేగం' సినిమా ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలిసింది. ఇక, తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్‌పై న్యూస్ లీకైంది.

టాలెంటెడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన 'భజే వాయు వేగం' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మే 31వ తేదీన విడుదలైన ఈ చిత్రం జూలై మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. కార్తికేయ - ప్రశాంత్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'భజే వాయు వేగం' సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











