ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు క్రైమ్ థ్రిల్లర్ అందులో వచ్చేసిందిగా!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోలుగా వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ హీరో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. మొదటి చిత్రంతోనే సంచలనం అయిన అతడు.. ఆ తర్వాత విభిన్నమైన కథలతో వస్తున్నాడు. ఇలా ఈ మధ్యనే 'భజే వాయు వేగం' మూవీ చేశాడు.
కార్తికేయ గుమ్మకొండ హీరోగా ప్రశాంత్ రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించిన సినిమానే 'భజే వాయు వేగం'. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని తిప్పుకుంది. ఫలితంగా మంచి అంచనాలను ఏర్పరచుకుంది. దీంతో ఈ సినిమాను మే 31వ తేదీన వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

కార్తికేయ గుమ్మకొండ - ప్రశాంత్ రెడ్డి కలిసి చేసిన 'భజే వాయు వేగం' సినిమా ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీకి మొదటి రోజు డీసెంట్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి డీసెంట్ రెస్పాన్స్‌ను అందుకుంది. కానీ, తర్వాత ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఫలితంగా కార్తికేయకు నిరాశే ఎదురైంది.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'భజే వాయు వేగం' సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు మంచి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా చేసిన 'భజే వాయు వేగం' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాను జూన్ 28 నుంచే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది. అందుకు అనుగుణంగానే గత అర్ధరాత్రి నుంచి దీన్ని స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. ఇక, ఈ చిత్రానికి ఓటీటీలో మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. కార్తికేయ గుమ్మకొండ - ప్రశాంత్ రెడ్డి కాంబోలో వచ్చిన 'భజే వాయు వేగం' సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











