పగలే శోభనం.. ఆలియాభట్‌కు కత్రినా కైఫ్ కౌంటర్.. కరణ్ జోహర్‌కు దిమ్మతిరిగేలా!
దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హోస్టుగా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 రంజుగా సాగుతున్నది. వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన ప్రశ్నలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. అయితే ఈ షోలో తాజాగా కత్రినా కైఫ్, సిద్దార్థ్ చతుర్వేది, ఇషాన్ కట్టర్ కలిసి కనిపించారు. ఎప్పటిలానే కరణ్ జోహర్ తన మార్కు ప్రశ్నలతో ఈ ముగ్గురిని తికమక పెట్టే ప్రయత్నం చేయగా కత్రినా కైఫ్ ఇచ్చిన సమాధానం ఎలా వైరల్ అయిందంటే..

శోభనం రాత్రి గురించి ఆలియాభట్
కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో కొద్ది వారాల క్రితం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆరంభ ఎపిసోడ్‌లో రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్ ఇద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఈ షోలో మొదటి రాత్రి అనుభవం గురించి కరణ్ జోహర్ ఓ ప్రశ్న అడిగితే.. అందరూ మొదటి రాత్రి ఏదో జరుగుతుందని అనుకొంటారు. రోజంతా పనులతో బిజీగా ఉండి.. ఫస్ట్ నైట్ ఏమీ జరగదు. హాయిగా అందరూ నిద్రపోతుంటారు అని ఆలియాభట్ అన్నారు.

శోభనం రాత్రి అలిసిపోయి
శోభనం రాత్రి గురించి అందరూ గొప్పగా ఊహించుకొంటారు. కానీ అందరూ అనుకొన్నట్టు ఆ రాత్రి ఏమీ జరగదు. నా శోభనం రాత్రి రోజున అలిసిపోయి నిద్ర పోయాను. శోభనం రాత్రి అనుభవం గురించి ఊహించుకోవడం ఓ అపోహ మాత్రమే అని ఆలియాభట్ వివరణ ఇచ్చారు.

పగటి పూటనే శోభనం
అయితే కత్రినా కైఫ్‌తో కరణ్ జోహర్ మాట్లాడుతూ.. ఆలియా భట్ చెప్పిన శోభనం రాత్రి అనుభవం గురించి ప్రస్తావిస్తే.. బహుశా వారి శోభనం పగటి పూటనే జరిగిపోవచ్చు. అందుకే అలిసిపోయి రాత్రి నిద్రపోయి ఉంటారేమో అని కత్రినా సమాధానం చెప్పింది.

అనన్య పాండేతో డేటింగ్
ఇక సిద్దాంత్ చతర్వేదితో మాట్లాడుతూ.. రిలేషన్ స్టేటస్ ఏమిటని అడిగితే.. నేను సింగిల్‌గానే ఉన్నాను. కానీ ఇషాన్ కట్టర్ నాతో సమయం గడిపి.. ఆయన కూడా సింగిల్ అయిపోయారని జోక్ చేశాడు. గతంలో ఇషాన్ కట్టార్, అనన్య పాండే డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
వైరల్‌గా కాఫీ విత్ కరణ్ 7 ప్రోమో
కాఫీ విత్ కరణ్ 7 షోలోకి వచ్చిన కత్రినా, ఇషాన్, సిద్దాంత్ చతుర్వేది ముగ్గురు ఫోన్ బూత్ అనే చిత్రంలో నటించారు ఈ సినిమాను ఫర్హాన్ అఖ్తర్ నిర్మించగా.. గుర్మిత్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ ముగ్గురు కలిసి కాఫీ విత్ కరణ్ 7లో హంగామా చేశారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను ముగ్గురు తమ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











