OTTలోకి కట్టప్ప కొడుకు బింబిసార తరహా కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బాహుబలిలో కట్టప్ప అందరికీ గుర్తుండే ఉంటాడు. కట్టప్పగా అలరించిన సత్య రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన మిర్చి సినిమాలోనూ ప్రభాస్ తండ్రిగా నటించి మెప్పించాడు. ఇక ఆయన తనయుడు శిబి సత్య రాజ్ హీరోగా తెరకెక్కిన సినిమా మయోన్. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది జూన్ 24న రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
సత్య రాజ్ ఇప్పుడంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు కానీ... ఆయన ఆ కాలంలోనే హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. అంతే కాదు.. మల్టీ స్టారర్ మూవీస్ కూడా ఆయన చేశాడు. ఆ తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి.. సినిమాలో హీరోలకు, హీరోయిన్స్ కు తండ్రిగా, విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే సత్య రాజ్ మాత్రం బహుబలి సినిమాతోనే తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. అంతకు ముందు మిర్చి సినిమాలో కూడా నటించి మెప్పించాడు.

అయితే సత్య రాజ్ కుమారుడు శిబి సత్యరాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ.. గత ఏడాది ఓ సినిమాను రిలీజ్ చేశారు. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాయోన్ అనే సినిమా జూన్ 24 వ తేదీన గత ఏడాది రిలీజ్ అయి ఆకట్టుకుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శిబి సత్య రాజ్ కు జోడిగా తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదలై.. పర్వాలేదనిపించింది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే... ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఒక దేవాలయం మిస్టరీని చేధించే కథాంశంతో ఈ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ రూపొందింది. కెమెరామెన్ రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్, ఇళయరాజా సమకూర్చిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మూవీ కొనసాగుతుంది. ఇక ఈ సినిమా చూసే వారికి ఇదో విజువల్ వండర్ గా అనిపిస్తుంటుంది.

ఇప్పుడు మాయోన్ మూవీ సంవత్సరం తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అసలు ఈ సినిమా ఉంది అనే విషయాన్ని మరిచిపోయారు ప్రేక్షకులు. అలాంటి సమయంలో ఇది ఓటీటీలోకి వచ్చింది. ఇక కొన్ని నెలల క్రితం ఈ మూవీ ఓటీటీ, డిజిటల్ ప్రిమియర్ త్వరలోనే ఉంటుందని ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పోస్ట్ ను పెట్టారు. ప్రైమ్ వీడియోలో మాయోన్ మూవీ వచ్చేసింది. విగ్రహాల దొంగతనం గురించిన రహస్యాన్ని ప్రపంచాని తెలిపేందుకు ఓ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ వచ్చేసింది.. చూసేయండి.. అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ మూవీ ఆ విజువల్స్ చూస్తూంటే... బింబిసార లాగా అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఈమూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సిబిరాజ్, తాన్యా రవిచంద్రన్, రాధా రవి, కేఎస్ రవికుమార్, ఎస్ఏ చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్, హరీష్ పేరడి, అరాష్ షా తదితరులు ఈ సినిమాలో నటించారు. కిషోర్ దర్శకత్వం వహించగా.. మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం నిర్మాతలుగా వ్యహారించారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించగా... డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











