OTT లోకి వచ్చేసిన బింబిసార తరహా తెలుగు మూవీ... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఓటీటీ లవర్స్ కు ఇది గుడ్ న్యూస్. మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా బింబిసార తరహా మూవీ. బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన కొడుకు హీరోగా నటించిన చిత్రం మయోన్. ఇప్పుడు ఇది తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ఎట్టకేలకు తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఆ పూర్తి వివరాల్లోకి వెళితే....
బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ అందరికి సుపరిచితమే. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన మిర్చి సినిమాలో ప్రభాస్ తండ్రిగా కూడా చేశారు. అంతేనా.. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగానూ చేశారు. ఇప్పుడంటే... క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నారు కానీ.. ఆ కాలంలో ఆయన పెద్ద హీరో. ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించారు.

ఇక సత్య రాజ్ మాత్రం బహుబలి సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. ఇక ఈయన కొడుకు శిబి సత్యరాజ్ హీరోగా పరిచయం చేస్తూ.. గత ఏడాది మయోన్ అనే సినిమాను రిలీజ్ చేశారు. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాయోన్ సినిమా జూన్ 24 వ తేదీన గత ఏడాది రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శిబి సత్య రాజ్ కు జోడిగా తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
ఇక మయోన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే... ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఒక దేవాలయం మిస్టరీని చేధించే కథాంశంతో ఈ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించారు. కెమెరామెన్ రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్, ఇళయరాజా సమకూర్చిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మూవీ కొనసాగుతుంది. ఇక ఈ సినిమా చూసే వారికి ఇదో విజువల్ వండర్ లా కనిపిస్తుంది.
ఇప్పుడు మాయోన్ మూవీ సంవత్సరం తర్వాత ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ సినిమా ఉందనే విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. అలాంటి సమయంలో ఇది ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నెల క్రితం తమిళ బాషలో ఇది ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అయింది. అయితే ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ... మయోన్ మూవీ రిలీజ్ అయింది. విగ్రహాల దొంగతనం గురించిన రహస్యాన్ని ప్రపంచాని తెలిపేందుకు ఓ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఆధ్యంతం ఆసక్తిగా సాగనుంది. ఇక ఈ మూవీ ఆ విజువల్స్ చూస్తూంటే... బింబిసార లాగా అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఈమూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సిబిరాజ్, తాన్యా రవిచంద్రన్, రాధా రవి, కేఎస్ రవికుమార్, ఎస్ఏ చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్, హరీష్ పేరడి, అరాష్ షా తదితరులు ఈ సినిమాలో నటించారు. కిషోర్ దర్శకత్వం వహించగా.. మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం నిర్మాతలుగా వ్యహారించారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించగా... డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











