ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఆ సీన్స్‌ను యాడ్ చేసి మరీ!
కామెడీ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి స్పంనద వస్తోంది. ఫలితంగా ఈ తరహా సినిమాలు టాలీవుడ్‌లో ఎక్కువగానే తెరకెక్కుతోన్నాయి. వాటిలో చాలా వరకూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటాయి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి కూడా. ఈ కోవలోనే రూపొంది ఇటీవలే వచ్చిన సినిమానే 'కీడా కోలా'.
క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన సినిమానే 'కీడా కోలా'. సస్పెన్స్ జోనర్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రెండు రోజులూ విశేషమైన స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నుంచే ఈ సినిమా ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను అందుకోలేదు.

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో 'కీడా కోలా'కు ఆరంభంలోనే మంచి గుర్తింపు దక్కింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుని విడుదలైంది. కానీ, ఈ టార్గెట్‌ను ఈ చిత్రం చేరుకోలేకపోయింది.
థియేటర్లలో కొద్ది రోజుల పాటు సందడి చేసిన 'కీడా కోలా' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి మంచి పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు సదరు సంస్థ మంచి మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు తెలిసింది.

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'కీడా కోలా' మూవీని డిసెంబర్ 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంటే.. నెల రోజుల తర్వాతనే ఈ చిత్రం స్ట్రీమింగ్ చేసుకోబోతున్నట్లు అయింది. ఇక, ఈ చిత్రంలో సెన్సార్ బోర్డు వాళ్లు మ్యూట్ చేసిన డైలాగులు, తీసేసిన సన్నివేశాలను కూడా యాడ్ చేసి ఓటీటీలోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 'కీడా కోలా' చిత్రాన్ని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, హరి కాంత్, చైతన్య రావు, రఘురామ్, విష్ణు, జీవన్ కుమార్ తదితరులు నటించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











