Bigg Boss Telugu 6 వెన్నుపోటు పొడిచావు.. నీకు ఎథిక్స్ లేవు.. రేవంత్‌పై రెచ్చిపోయిన కార్తీకదీపం కీర్తి
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో రెండోవారంలోకి ప్రవేశించింది. తొలివారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఇంటి సభ్యులందరూ ఊపిరి పీల్చుకొన్నారు. అయితే రెండోవారం రంజుగా మొదలైంది. సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. నామినేషన్ ప్రక్రియ సందర్బంగా కీర్తీభట్, సింగర్ రేవంత్ మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. వారిద్దరి గొడవకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రేవంత్ నీ బిహేవియర్ బాగాలేదు
రేవంత్‌ను నామినేట్ చేస్తూ.. వెన్నుపోటు వ్యవహారాన్ని ప్రస్తావించింది. వెన్నుపోటు కామెంట్ తర్వాత నేను ఎదురుపడితే.. చాలా దారుణంగా ప్రవర్తించావు. నన్ను పట్టించుకోకుండా బిహేవ్ చేస్తున్నావు. నేను పక్కన ఉన్న సత్యను బయటకు తీసుకెళ్లి మాట్లాడుకొందామని అన్నావు. నేను సత్య ఇద్దరం మా బెడ్‌పై కూర్చొని ఉంటే.. నా టవల్‌పై కూర్చొన్నావు. అది నాది అని చెప్పగానే... నీవు వెంటనే లేచి నిలచుకొన్నావు. అది నాకు నచ్చలేదు అని కీర్తీభట్ అంది.

అశుద్ధం అని తెలిసి కూడా
అయితే కీర్తీ భట్ మాటలకు రేవంత్ అడ్డం పడుతూ.. నేను అశుద్దం అని తెలిసి కూడా నేను కాలు పెట్టలేను. తడిగా ఉంది అని లేచి పక్కన కూర్చొన్నాను. నేను వెన్నుపోటు పోడిచానని చెప్పినందుకు అలా బిహేవ్ చేయడం లేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను నీ మాటలకు హర్ట్ అయ్యాను అని రేవంత్ అన్నాడు.

నేను మాట్లాడితే వినాలి అంటూ రేవంత్
అయితే రేవంత్ మాటలకు అడ్డుపడుతూ.. నేను ఏదో మాట్లాడితే.. నీవు మరో విషయాన్ని తీసుకొస్తున్నావు. సాఫ్ట్‌గా మాట్లాడి విషయాన్ని కన్విన్స్ చేయవచ్చు అని కీర్తీ చెప్పింది. అయితే నేను నెమ్మదిగా మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. నేను మాట్లాడినప్పుడు మీరు వినాలి అంటూ రేవంత్ గట్టిగా అరిచాడు.

నీలో నెగిటివ్ ఫాల్ట్ అదే అంటూ కీర్తీ
అయితే రేవంత్ తనపై గట్టిగా అరవడంతో నీతో ఉన్న సమస్య ఇదే. నీ బిహేవియర్‌లో నెగిటివ్ ఫాల్ట్ అదే అంటూ కీర్తీ భట్ వేలెత్తి పాయింట్.. అవుట్ చేసింది. ఇదే నీవద్ద నుంచి నచ్చని పాయింట్. అనవసరంగా కోపం తెచ్చుకోకు. నీ నుంచి ప్రతీ ఒక్కరు కోరుకొనేది అదే అని కీర్తీ చెప్పింది. అయితే నీవు చెప్పాల్సింది చెప్పావుగా.. నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను అని రేవంత్ అన్నారు.

గీతూను నామినేట్ చేస్తూ రేవంత్
ఆ తర్వాత రేవంత్ తన నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ. గీతూ రాయల్‌ను నామినేట్ చేశాడు. నామినేషన్ చేస్తూ.. నెమ్మదిగా మాట్లాడుకొందామా అంటే.. నీవెట్ట మాట్లాడినా నాకు అవసరం లేదు అని గీతూ సమాధానం చెప్పింది. నిన్ను నామినేట్ చేయడం కూడా చీ అనుకొన్నాను. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నీకు ఆ విలువలు లేవు. నేను మారలేదని చెప్పావు కదా.. నేను మారానో లేదో నీకు చెప్పనవసరం లేదు. నీవు చెప్పే మాటలు వినడం నాకు అవసరం లేదు అని రేవంత్ అంటే.. చెవిలో దూదిపెట్టుకో అని గీతూ ఘాటుగా స్పందించింది.


Click it and Unblock the Notifications











