నేరుగా OTTలోకి రాబోతున్న కీర్తి సురేష్ రివెంజ్ థ్రిల్లర్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?

ఈ ముధ్య కాలంలో అనేక సినిమాలు త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. త్వరగానే కాదు.. మరికొన్ని చిత్రాలు అయితే నేరుగా ఓటీటీలోనే విడుదల అయి హిట్లుగా నిలుస్తున్నాయి. కరోనా సమయంలో ఇది చాలా ఎక్కువగా సాగగా.. ఈ మధ్యే కాస్త తగ్గుముఖం పట్టింది. ఎక్కువ సినిమాలు నేరుగా థియేటర్లలోకి వస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఓటీటీ వేధికగా విడుదల చేసేందుకు ఇప్పటికీ ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మరో అద్భుతమైన సినిమా ఓటీటీలోనే నేరుగా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జయం రవి, కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైరెన్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. వీరే కాకుండా ఈ సినిమాలో యోగాబాబు, సముద్రఖని, కౌశిక్ మెహతాలు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఆంటోని భాగ్యరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. విపరీతమైన స్పందన వచ్చింది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్రైలర్ తోనే అందిరోనూ అంచనాలు పెంచేసిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

Keerthy Suresh And Jayam Ravi Siren Movie Will Be Released Directly in OTT Check Details

చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయలేరు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేధికగా ఈ చిత్రాన్ని జనవరి 26వ తేదీన విడుదల చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. అన్ని హంగులతో కమర్షియల్ గా రూపొందించిన ఈ సినిమాను ఓటీటీ వేధికగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలియడంతో అంతా షాకవుతున్నారు.

అయితే పెద్ద పెద్ద నటులు ఉన్న ఈ సినిమాను ఇలా సడెన్ గా అందులోనూ ఓటీటీలో ఎందుకు స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంతా అనుకుంటున్నారు. కంటెంట్ మీద పూర్తిగా నమ్మకలేకపోవడం వల్లనో లేక బయట జరిగే బిజినెస్ కంటే దీని వేధికగా ఎక్కువ డబ్బులు రావడం వల్లనో ఈ సినిమా ఓటీటీ వేధికగా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఓటీటీ వేధికగా విడుదల అయితే చూడాలని చాలా మంది సినీ ప్రియులు రెడీగా ఉన్నారు.

Keerthy Suresh And Jayam Ravi Siren Movie Will Be Released Directly in OTT Check Details

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X