OTT డైరెక్ట్‌గా ఓటీటీలోకి కీర్తి సురేష్ రీసెంట్ సినిమా.. ఎప్పుడు? ఎందులో అంటే?
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో చాలా మందికి ఇప్పుడు మంచి పడడం లేదు. గడచిన కొన్నేళ్లలో భారీ హిట్స్ అందుకొని ఇప్పుడు ఆ హీరోయిన్స్ అంతా కూడా హిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అలా కొందరు అయితే చేతిలో ఆఫర్స్ కూడా లేకుండా ఉన్నారు. ఇలా ప్రస్తుతం ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్స్ గా ఏలిన హీరోయిన్స్ పూజా హెగ్డే, కీర్తి సురేష్ లు కూడా ఉన్నారు.
మరి ఇపుడు ఈ ఇద్దరి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. పూజా హెగ్డేకి తెలుగులో సినిమాలే లేవు. ఇక కీర్తి విషయానికి వస్తే తెలుగులో మంచి ఫేమ్ ఉన్నప్పటికీ ఆమె రీసెంట్ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ అయ్యి మరీ రిలీజ్ కి కూడా నోచుకోలేదు. ఇలా కీర్తి సురేష్ పరిస్థితి మారిపోయింది. కాగా ఆ సినిమానే "రఘు తాత" కాగా ఈ చిత్రాన్ని కన్నడ భారీ హిట్స్ నిర్మాణ సంస్థ కేజీఎఫ్, సలార్, కాంతార లాంటివి అందించిన హోంబలే ఫిల్మ్స్ వారు తమిళ్ లో మొట్ట మొదటి సినిమాగా తీశారు.

ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీకి కూడా దారి తీశాయి. ఇలా కొంచెం గందరగోళం నడుమ తమిళ్ లో కూడా పెద్దగా బజ్ లేకుండానే వచ్చేసిన ఈ చిత్రం ప్లాప్ గానే మిగిలిపోయింది. దర్శకుడు సుమన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కామెడీ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ప్లాన్ చేశారు.
మరి అప్పుడు థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ మిస్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో తెలుగులో రిలీజ్ కి రావడానికి సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమాని స్ట్రీమింగ్ యాప్ జీ 5 వాళ్ళు తాజాగా అనౌన్స్ చేశారు. తెలుగు ఇంకా తమిళ్, మరో సౌత్ భాష కన్నడలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి కీర్తి సురేష్ లాంటి స్టార్ నటి సినిమా థియేటర్స్ లో తెలుగు రిలీజ్ స్కిప్ చేసి ఇలా డైరెక్ట్ గా ఓటిటిలో వస్తుండడం గమనార్హం.

అన్నట్టు ఈ సినిమా ఈ సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. మరి తెలుగులో మిస్ అయ్యినవాళ్ళకి ఇది కొత్త సినిమా లెక్కే అని చెప్పొచ్చు. మరి తమిళ్ లో ప్లాప్ అయ్యిన ఈ చిత్రం మన తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ని అందుకుంటుందో చూడాలి. కాగా ఈ చిత్రం మిస్టర్ బచ్చన్, సినిమాలతో థియేటర్స్ లోకి రావాల్సింది ఒక్క తమిళ్ లో మాత్రమే వచ్చింది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు ఎం ఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే సీన్ రొల్డన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











