కీర్తీ సురేష్ మూవీ థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో సంచలనం.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో తెలుసా?
మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధిస్తుండటం అందర్నీఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. ఇండిపెండెన్స్ డే కానుకగా తమిళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం అనూహ్యంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొంటున్నది. ఈ సినిమా ఓటీటీ పెర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌తోపాటు ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమాకు సుమన్ కుమార్ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.

కీర్తీ సురేష్ నటించిన ఈ చిత్రం తమిళనాడులో తొలి రోజు 22 లక్షలు, రెండో రోజు 6 లక్షలు, మూడో రోజు 14 లక్షలు వసూలుచేసింది. ఆ తర్వాత కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఈ చిత్రం మొత్తంగా 61 లక్షల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 13వ తేదీన ఓటీటీలోకి వచ్చింది.
రఘు తాత చిత్రం వినోదం, ఫ్యామిలీ డ్రామా, సామాజిక అంశాలను ప్రేక్షకులు ఆలోచింప జేసే విధంగా ఈ సినిమాను రూపొందించారు. కథ, కథనాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. నటీనటులు పెర్ఫార్మెన్స్, విజువల్ తదితర అంశాలు రిచ్‌గా ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నది.

డిఫరెంట్ స్టోరీ, విలక్షణమైన పాత్రలు, నటనతో రూపొందిన రఘు తాత సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో అనూహ్యమైన రెస్సాన్స్ కూడగట్టుకొంటున్నది. నమ్మిన దాని కోసం నిలబడే స్వతంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్రలో కీర్తి సురేష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.
ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చే విధంగా రూపొందిన ఎమోషనల్ మూవీ రికార్డు వ్యూస్ సాధించింది. ఓటీటీలో విడుదలైన 24 గంటల్లోనే ఈ చిత్రానికి 50 మిలియన్ స్ట్రీమింగ్ గంటల వ్యూస్ రావటం విశేషంగా మారింది. ఓటీటీలో కీర్తీ సురేష్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను ఈ సినిమా గుర్తు చేసింది.


Click it and Unblock the Notifications











