కేరళ క్రైమ్ ఫైల్స్ 2 రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఈ జోనర్‌లో మలయాళ ఫిలిం మేకర్స్ టాప్‌లో ఉన్నారు. కోవిడ్ తర్వాత మలయాళం సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. తెలుగు ప్రేక్షకులైతే ప్రతివారం ఎలాంటి సినిమా వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తోన్న చిత్రమే కేరళ క్రైమ్ ఫైల్స్ 2. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
లాడ్జిలో హత్య చుట్టూ సీజన్ 1
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1లో శ్రీజిత్ మహదేవన్, అన్సల్ బెన్, అజి అలోక్, దేవకి రాజేంద్రన్, హరిశంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ ఈ సీజన్ 1 నిర్మించగా రాహుల్ రిజి నాయర్ నిర్మాతగా వ్యవహరించారు. అషిక్ ఐమర్ రచనా సహకారం అందించగా అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించారు. జూన్ 23, 2023న కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 జియో హాట్‌స్టార్‌లో రిలీజై ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. సీజన్ 1లో లాడ్జిలో జరిగిన హత్య కేసును ఛేదించడం చూపించారు. సింగిల్ క్లూతో మిస్టరీని విప్పే విధానాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ సిరీస్‌కు వచ్చిన ఆదరణనతో సెకండ్ పార్ట్‌ను అంతకుమించి అనేలా చిత్రీకరించారు.

సీజన్ 2పై భారీ అంచనాలు
కేరళ క్రైమ్ ఫైల్స్ 2లో అజు వర్గీస్, లాల్, నవాస్ వల్లిక్కున్ను, సంజు సంచేన్, జింజ్ షాన్‌లు కీలకపాత్రలు పోషించారు. సీజన్ 2కు మంకీ బిజినెస్ సంస్థ నిర్మాణం వహించగా.. అహ్మద్ కబీర్, జితిన్, హాసన్ రషీద్‌లు నిర్మాతలు. హెషం అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చగా.. జితిన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 మంచి ఆదరణ దక్కించుకున్న నేపథ్యంలో సీజన్ 2పై భారీ అంచనాలున్నాయి. తాజాగా సీజన్ 2 రిలీజ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది.
ఆసక్తి పెంచేలా సీజన్ 2
కేరళ క్రైమ్ ఫైల్స్ : ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు పేరుతో సీజన్ 2ను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. కొత్త టీం కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందని, కానీ ఇది ఒక పెట్టె తెరవడం లాంటిదని.. అందులో ఉన్నది బంగారమో, భూతమో తెరిచే వరకు తెలియదంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీనిని బట్టి అదృశ్యమైన పోలీస్ ఆఫీసర్ కోసం పోలీస్ శాఖ వెతుతుకుందని అర్ధమవుతుంది. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే ఊహించని ట్విస్టులు.. కథ, కథనాలతో సెకండ్ సీజన్ కూడా సాగుతున్నట్లుగా అనిపిస్తోంది.
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ స్ట్రీమింగ్ వివరాలు
జూన్ 20 నుంచి కేరళ క్రైమ్ ఫైల్స్ 2 సిరీస్.. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాళీ, మరాళీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. మరి కేరళ క్రైమ్ స్టోరీస్ సీజన్ 2 ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల ద్వారా దక్షిణాదిలో పాపులరైన సీనియర్ నటుడు, దర్శకుడు లాల్ ఈ సెకండ్ పార్ట్‌లో నటిస్తుండటంతో తాజా సీజన్‌పై అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











