KGF Chapter 2 OTT: ఆ ఓటీటీలో కేజీఎఫ్ 2 స్ట్రీమింగ్.. చూడాలంటే మాత్రం ఓ కండీషన్!
కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొందినా.. దక్షిణాదిలోని భాషలో పాటు బాలీవుడ్‌లోనూ విడుదలై.. అన్ని చోట్లా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా ఇది ప్రతి చోటా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. ఫలితంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌ను అందుకుంది. ఈ ఉత్సాహంతోనే చిత్ర యూనిట్ దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని రూపొందించింది.
మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించారు. మొదటి భాగంలో కేజీఎఫ్‌ను సొంతం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఈ మూవీ కథ ప్రారంభం అవుతుంది. ఇక, ఇందులో దానికి మించిన ఎలివేషన్ సీన్స్ డిజైన్ చేశారు. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలతో గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ దక్కింది. ఫలితంగా ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఇది హిందీలో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది.

హిట్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రాన్ని సదరు సంస్థ మే 27 నుంచి స్ట్రీమింగ్ చేయబోతుందని కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అమెజాన్ సంస్థ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేసింది. దీంతో రాఖీ భాయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతూనే అసలు విషయం తెలిసి షాక్‌కు గురవుతున్నారు.
'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. అయితే, దీన్ని చూడాలంటే మాత్రం రూ. 199 తో ఎర్లీ యాక్సెస్ సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రూ. 199 చెల్లిస్తేనే ప్రస్తుతానికి చూడడం వీలు పడుతుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత 30 రోజుల వరకూ ఎప్పుడైనా సినిమాను చూడొచ్చు. కానీ, ఒక్కసారి సినిమా చూడడం ప్రారంభిస్తే మాత్రం 48 గంటల్లోనే దాన్ని ముగించాలి. లేదంటే ఆటోమేటిక్‌గా ఆఫర్ క్లోజ్ అయిపోతుంది. దీంతో చాలా మంది ఈ ప్లాన్‌పై పెదవి విరుస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్రను పోషించింది.


Click it and Unblock the Notifications











