యువ హీరోతో సహజీవనం.. పెదవి విప్పిన కియారా అద్వానీ..
బాలీవుడ్ ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. ఇక ఇప్పుడు మరో జంట కూడా వివాహానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సిద్దార్థ్ మల్హోత్ర కియారా అద్వాణీల మధ్య డేటింగ్, లవ్ మీద రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. వీటిపై కియారా గానీ, సిద్దార్థ్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు. మొత్తానికి మొదటి సారిగా వీటిపై కియారా ఓపెన్ అయింది.

కాఫీ విత్ కరణ్..
హిందీ జనాలకు, నార్త్ బెల్ట్‌లో కాఫీ విత్ కరణ్ షోకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన కరణ్ జోహార్ ఈ షోను ఆరు సీజన్లు బాగానే నడిపించాడు. ఇక ఇప్పుడు ఓటీటీలో మరింత మసాలా అద్దేందుకు కరణ్ ప్రయత్నిస్తున్నాడు.

ఆ ప్రశ్నలే..
తన షోకు వచ్చే గెస్టుల పర్సనల్ లైఫ్, సెక్స్ లైఫ్, అఫైర్ల మీద ప్రశ్నలు వేస్తుంటాడు కరణ్ జోహర్. తన సెక్స్ లైఫ్, పర్సనల్ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ ఉండదని, అందుకే తాను కరణ్ జోహార్ షోకు వెళ్లడం లేదని తాప్సీ కరణ్ షో మీద సెటైర్లు వేసింది. అయితే ఇప్పుడు ఈ ఏడో సీజన్ మాత్రం బాగానే వైరల్ అవుతోంది.

బ్రేకప్, అఫైర్లు..
కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్‌లో ఇప్పటి వరకు జాన్వీ కపూర్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, సమంత, విజయ్, అనన్య పాండేలు వచ్చారు. ఇందులో కరీనా ఆమిర్ కలిసి కరణ్‌కు కాస్త గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు. బెడ్రూం ప్రశ్నలు, సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగటంపై కరీనా, ఆమిర్‌లు కౌంటర్లు వేశారు.

తాజాగా అలా..
ఇక ఈ వారం కరణ్ షోకు షాహిద్ కపూర్, కియారా అద్వాణీలు గెస్టులుగా వచ్చారు. ఇక కరణ్ అడిగే ప్రశ్నలేంటో.. అవి ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. షాహిద్ కపూర్ పర్సనల్ అండ్ సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగేశాడు. ఇక సిద్దార్థ్ మల్హోత్రతో కియారా రిలేషన్ గుట్టు లాగేందుకు కరణ్ ప్రయత్నించాడు.

పరోక్షంగా ఓపెన్..
సిద్దార్థ్ మల్హోత్ర తనకు మంచి ఫ్రెండ్.. అంతకంటే ఎక్కువే అని చెప్పుకొచ్చింది. దీంతో మరింత సాగదీసేందుకు కరణ్ ప్రయత్నించాడు.. పక్కనే ఉన్న షాహిద్ కూడా రెచ్చిపోయాడు. ఈ ఏడాది ఈ ఇద్దరి నుంచి సినిమాలకు సంబంధించిన విషయం కాకుండా అతి పెద్ద ప్రకటన వచ్చే చాన్స్ ఉందని అనేశాడు. అవునేమో.. జరుగుతుందేమో అన్నట్టుగా కియారా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. షేర్షా సినిమాతో సిద్దార్థ్, కియారా మధ్య బంధం బలపడింది. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











