Kill Movie On OTT: ఓటీటీలో 40 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. ఎప్పుడు? ఏ ఫ్టాట్‌ఫామ్‌లో రిలీజ్ అంటే?
బాలీవుడ్‌లో ఎలాంటి హంగామా, అలజడి, ప్రమోషన్స్ లేకుండా వచ్చిన చిత్రం కిల్ (Kill). తొలి ఆట పడగానే ఈ సినిమాకు అనూహ్యమైన పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఊపందుకొన్నాయి. నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో లక్ష్య, రాఘవ్ జుయల్, తన్యా మణికంఠ తదితరులు నటించారు. ఇక ఈ సినిమా కల్కి లాంటి సినిమా ముందు, ఆ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల సునామీలోను భారీగా వసూళ్లు సాధించింది. అలాంటి సినిమా ఓటీటీ రిలీజ్ గురించిన వివరాల్లోకి వెళితే..
కిడ్నాప్ డ్రామాగా రూపొందిన కిల్ చిత్రంలో పూర్తిగా ట్రైన్‌లోనే షూట్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 15 కోట్ల రూపాయల మేర అయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 2023 సంవత్సరంలో టొరెంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడంతో అంతర్జాతీయ సినిమా ప్రముఖుల దృష్టిపడింది. ఇండియాలో సుమారుగా 400 స్క్రీన్లలో రీలీజ్ చేశారు.

కిల్ చిత్రం కోట్ల షేర్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ మూవీ నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 24 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 19 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇలాంటి సినిమా హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ఛానెల్స్ పోటీ పడ్డాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్ కోసం ఫ్యాన్సీ రేటును చెల్లించి డిస్నీ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనల ప్రకారం 8వ వారంలో ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా ఆగస్టు చివరి వారంలో స్టీమింగ్ కానున్నది.

కిల్ (Kill Story) సినిమా కథ విషయానికి వస్తే.. అమ్రిత్ రాథోడ్ (లక్ష్య) ఓ జవాన్. తాను, తన ప్రేయసి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా దోపిడి దొంగలు హైజాక్ చేస్తారు. ఆ ఘటనలో అమ్రిత్ ప్రేయసిని దొపిడి దొంగ ఫణి (రాఘవ్ జుయల్) దారుణంగా చంపేస్తాడు.దాంతో అమ్రిత్ జీవితం మరో టర్న్ తిరుగుతుంది. ఫణి తండ్రి బేణి (ఆశీష్ విద్యార్థి) తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అయితే అమ్రిత్ రాథోడ్ ఫణిపై ప్రతీకారం తీర్చుకొన్నాడా? ఈ కథకు ముగింపు.


Click it and Unblock the Notifications











