Kill on OTT: ఆ దేశంలో ఓటీటీలోకి ముందే కిల్.. ఇండియాలో ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?

పలు సినిమా ఇండస్ట్రీస్ లో ఒకే కోవలో సినిమాలు వెళ్తున్నపుడు ఒక్క సినిమా వచ్చి గేమ్ ఛేంజ్ చేస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి మరిన్ని క్రేజీ సినిమాలు ఆ తరరహాలో వస్తుంటాయి. అయితే అలా వచ్చిన కొన్ని చిత్రాల్లో పెద్ద హిట్ అయ్యినవీ ఉంటాయి ఎక్కువ గుర్తింపుకి నోచుకోనివి కూడా ఉంటాయి.కాగా ఇప్పుడు ఇలాంటి సినిమా ఒకదాని కోసమే మాట్లాడుకునేది..

ఈ ఏడాదిలో బాలీవుడ్ సినిమా నుంచి అనేక చిత్రాలు వచ్చాయి కానీ కొన్ని మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలే హిట్స్ గా నిలిచాయి. మరి ఈ అన్నిటికి మించి ఒక సర్ప్రైజింగ్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది బ్రూటల్ బ్లడ్ అండ్ యాక్షన్ డ్రామా "కిల్" సినిమానే అని చెప్పాలి. దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కొత్త యువ హీరో లక్ష్య లల్వాని నటించాడు.

Kill streaming on Amazon Prime Apple TV in USA Here is Indian release date

అయితే ఓ హీరోకి సినిమా ఎంట్రీ ఎలా ఉండాలి అంటే దానికి ఉదాహరణగా ఈ చిత్రాన్ని చెప్పవచ్చు. ఇండియన్ సినిమా దగ్గరే ఒక ఊహించని యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. కానీ ఇదే సినిమా కానీ ఇతర బిగ్ స్టార్ లాంటి వాళ్ళు చేసుంటే బాక్సాఫీస్ మోత మోగి ఉండేది అని సినిమా చూసి ఫీలయ్యారు. అలాగే ఇంకా ఏ చిత్రానికి మరింత గుర్తింపు రావాల్సింది అని కూడా చింతించిన వారూ లేకపోలేరు.

ఇలా పెను సంచలనం అనిపించుకున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆల్రెడీ యూఎస్ లో ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ లాంటి ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేసింది. కానీ ఇండియాలో ఎపుడు ఎందులో వస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ ఇన్ఫో వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రాన్ని ఇండియాలో ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగులు చేశారట.

Kill streaming on Amazon Prime Apple TV in USA Here is Indian release date

అయితే ఇందులో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సమయమే పట్టేలా ఉందట.కాగా ఇండియాలో ఈ సినిమా ఏకంగా సెప్టెంబర్ లో రిలీజ్ కి రాబోతున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. సో కిల్ ని ఇండియాలో అది కూడా ఓటిటి లోనే చూడాలి అనుకునేవారు మాత్రం సెప్టెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సిందే.

ఇంకా ఈ సినిమాలో తన్యా మానిక్తల హీరోయిన్ గా నటించగా విలన్ గా యువ నటుడు రాఘవ్ జుయల్ అదరగొట్టేసాడు. మరి ఈ సినిమా కంటెంట్ పరంగా ఎలాంటి సంచలనం సెట్ చేసిందంటే ఈ సినిమా రీమేక్ హక్కులు ఏకంగా హాలీవుడ్ సెన్సేషనల్ హిట్ "జాన్ విక్" దర్శకుడు కొనుగోలు చేసాడు. ఇలా ఇండియన్ సినిమా నుంచి రీమేక్ కాబోతున్న అతి తక్కువ చిత్రాల్లో ఒకటిగా కిల్ సినిమాకే ఆ అరుదైన ఘనత కూడా దక్కింది.

More from Filmibeat

Read more about: kill movie lakshya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X